చిన్న కారును ఇండియాకు తీసుకురానున్న వోల్వో
వోల్వో వీ40 చిన్న కారే అయినప్పటికీ, దీని ధర మాత్రం చిన్నదిగా ఉండే అవకాశమే లేదు. వచ్చే నెలలో జరగనున్న జెనీవా మోటార్ షోలో వోల్వో వీ40 2012 వెర్షన్ కారును కంపెనీ ఆవిష్కరించనుంది. ఈ మోడల్ ఇండియాకు రావడానికి మరో సంవత్సరం సమయం పట్టనుంది. భారత మార్కెట్లో వోల్వో వీ40 కారు ధర రూ.20-22 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
వోల్వో ఎస్40 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న వోల్వో వీ40 కారు మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇటీవల వోల్వో భారత్‌లో అందిస్తున్న ఎస్60, ఎస్80, ఎక్స్‌సీ60 మోడళ్లలో చౌకరకం వేరియంట్లను విడుదల చేసిన సందర్భంగా వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎర్న్‌బర్గ్ మాట్లాడుతూ..
ఈ సంవత్సరం రెండు గ్లోబల్ మోడళ్లను ప్రవేశపెట్టనున్నామని, ఇందులో ఒక చిన్న వాహనం ఉంటుందని, దానిని ఇండియా మార్కెట్‌కు తీసుకు వస్తామని అన్నారు. ఈ చిన్న కారు ద్వారా పెద్ద మార్కెట్ వాటాను చేజిక్కుంచుకోవాలని వోల్వో భావిస్తోంది.


Click it and Unblock the Notifications









