మొండి వైఖరితో పెట్టుబడులు కోల్పోతున్న మాహారాష్ట్ర
అయితే, ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లలో సాధారణ నిర్వహణలకు కావాల్సిన పెట్టుబడులు మాత్రం యధావిధిగా కొనసాగిస్తామని, పెద్ద మొత్తంలో పెట్టుబడులకు ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు ఇండియా చీఫ్ జాన్ చాకో తెలిపారు.
గతంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మహారాష్ట్ర సర్కారు, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకు వాహనాల అమ్మకాలపై చెల్లించిన వ్యాట్‌ను తిరిగి ఇస్తానని (రీఫండ్) హామీ ఇచ్చింది. అయితే తాజాగా మహా సర్కారు కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చిన రాష్ట్రంలో విక్రయించిన వాహనాలకు మాత్రమే వ్యాట్‌ను రీఫండ్ చేస్తామని, బయటి రాష్ట్రాల్లో విక్రయించే లేదా విదేశాలకు ఎగుమతి చేసే వాహనాలకు వ్యాట్ రీఫండ్ చేయబోమని పేర్కొంది.
ఈ విషయమై మాహారాష్ట్ర సర్కారుతో చర్చలు జరుపుతున్నామని, ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించినట్లయితే, పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతామని కంపెనీ పేర్కొంది. ఇండియాలో ఆడి, స్కోడా వంటి బ్రాండ్‌లను అందిస్తున్న ఫోక్స్‌వ్యాగన్‌కు మహారాష్ట్రలోని చాక్కన్, ఔరంగాబాద్‌లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి.


Click it and Unblock the Notifications









