బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను చూసి అవాక్కయిన రీనాల్ట్-నిస్సాన్

టాటా నానోకు పోటీగా, బజాజ్ ఆటో కంపెనీతో చేతులు కలిపి ఓ చిన్న కారును ప్రవేశపెట్టాలనుకున్న రీనాల్ట్-నిస్సాన్ కంపెనీలకు 'ఆర్ఈ60' ఫోర్-వీలర్‌తో బజాజ్ ఆటో షాకిచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రీనాల్ట్-నిస్సాన్ జాయింట్ వెంచర్ నానోకు పోటీగా ఓ చిన్న కారును విడుదల చేయాలనుకున్నాయి గానీ పర్సనలైజ్డ్ ఆటోను కాదు.

గతంలో జరిగిన ఓ ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో ప్రదర్శించిన ఆల్ట్రా-లో-కాస్ట్ కాన్సెప్ట్ కారుకి, ఇటీవల జరిగిన 11వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన ఫోర్-వీలర్ కొంచెం కూడా పొంతన లేదు. దీంతో రీనాల్ట్, నిస్సాన్ కంపెనీలు బజాజ్ ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను మార్కెటింగ్ చేసే విషయంలో సమాలోచనలో పడ్డాయి.

గడచిన 2009 సంవత్సరంలో బజాజ్, రీనాల్ట్, నిస్సాన్ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, బజాజ్ ఆటో ఓ చిన్న కారును పూర్తిగా తమ స్వంత టెక్నాలజీతో తయారు చేస్తుంది. ఇలా బజాజ్ తయారు చేసిన చిన్న కారును రీనాల్, నిస్సాన్ కంపెనీలు తమ బ్రాండ్ నేమ్‌ను అంటించి మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది.

కాగా.. సాంప్రదాయ త్రిచక్ర వాహనాలను రీప్లేస్ చేసేవిధంగా బజాజ్ ఆటో రూపొందించిన ఆర్ఈ60 ఫోర్-వీలర్‌ను గడచిన జవరిలో విడుదల చేసిన సందర్భంగా రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. దీనిని రూపొందించడం వరకే మా బాధ్యత అని, మార్కెటింగ్ చేసేది లేనిది వారి (రీనాల్ట్-నిస్సాన్) ఇష్టమని స్పష్టం చేయటం జరిగింది.

ఇప్పుడు ఇదే విషయాన్ని రీనాల్ట్-నిస్సాన్‌ను ప్రశ్నించగా, ఈ ఫోర్-వీలర్‌పై తమ విశ్లేషణ ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తయిన తర్వాతే తామే తెలియజేస్తామని మాట దాటవేస్తోంది. భారత మార్కెట్లో అసలే కొత్తగా ప్రవేశించిన కంపెనీ కావడంతో ఇక్కడి మార్కెట్లో అప్రమత్తంగా, ఆచితూచి మెలగకపోతే ఎక్కువ కాలం నిలబడటం కష్టమని రీనాల్ట్ నిస్సాన్ భావించినట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 8, 2012, 14:48 [IST]
English summary
Renault-Nissan is still thinking to source a mini four-wheeler (RE60) from Bajaj Auto. "We did not finish our analysis and will let you know once this analysis is finished," said Carlos Ghosn, the chief of the Franco-Japanese automobile alliance at the Geneva Motor Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+