ఐపిఎల్ ఎడిషన్ వెంటో, పోలో కార్లలో స్పెషల్ ఏంటి..?

ప్రస్తుతం దేశమంతటా ఐపిఎల్ ఫీవర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐపిఎల్ క్రికెట్ సీజన్‌కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న వెంటో సెడాన్‌, పోలో హ్యాచ్‌బ్యాక్‌లలో ఓ ఐపిఎల్ ఎడిషన్‌ 2ను కంపెనీ అందిస్తోంది.

ఈ స్పెషల్ ఎడిషన్ వెంటో, పోలో కార్లలో క్రింద పేర్కొన్న అదనపు ఫీచర్లు లభించనున్నాయి:

మల్టీమీడియా కార్ ప్యాడ్:
ఐపిఎల్ ఎడిషన్ 2 పోలో, వెంటో కార్లలో వెనుకవైపు కూర్చునే ప్యాసింజర్ల కోసం మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన కార్ ప్యాడ్ లభిస్తుంది. ఇది నావిగేషన్, సోషల్ నెట్‌వర్కింగ్ ఆప్షన్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఐపిఎల్ మ్యాచ్‌లను కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

బూట్(కారు వెనుక భాగం)పై ఐపిఎల్ బ్రాండింగ్:
మీరు క్రికెట్ అభిమానులని మీ కారు ఇట్టే అవతలి వాళ్లకు తెలియజేస్తుంది. కొత్త ఐపిఎల్ ఎడిషన్ వెంటో, పోలో కార్ల వెనుకవైపు లోగోకు కుడి భాగంలో వెంటో పేరుకు ఎగువన ఐపిఎల్ లోగో ఉంటుంది. ఈ కారులో రోడ్డుపై వెళ్తున్నప్పుడు అతవలి వారి దృష్టిని ఇట్టే మీ వైపుకు తిప్పుకుంటుంది.

డోర్ సిల్ డిజైన్:
ఈ ఐపిఎల్ ఎడిషన్ 2 కార్లలో డోరుకు అడుభాగంలో ఓ అల్యూమినియంతో చేయబడిన ఫ్రేమ్ లాంటి మెటీరియల్‌పై ఐపిలో లోగో ఉండి, కారు లోపలి వైపు కూడా క్రికెట్‌పై మీకున్న ప్రేమను తెలియజేస్తుంది.

డ్యూయెల్-టోన్ లెథరెట్ట్ సీట్ కవర్స్:
ఐపిఎల్ ఎడిషన్ 2 పోలో, వెంటో కార్లలో లెథర్‌తో చేయబడిన, రెండు రంగుల కలయిక (డ్యూయెల్ టోన్)తో కూడిన సీట్లు లభిస్తాయి. ఇవి కారు ఇంటీరియర్‌కు మంచి లుక్‌ను ఇవ్వటమే కాకుండా, సౌకర్యవంతమైన సీటింగ్ అనుభూతిని కూడా కల్పిస్తాయి.

స్పెషల్ ఫ్లోర్ మ్యాట్స్:
ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఫ్లోర్ మ్యాట్స్ లభిస్తాయి. ఈ ఫ్లోర్ మ్యాట్లపై ఐపిఎల్ లోగో ప్రింట్ చేయబడి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ పోలో ఐపిఎల్ ఎడిషన్ 2 ధరలు:
* 1.2 పెట్రోల్ హైలైన్ - రూ.6.13 లక్షలు
* 1.6 పెట్రోల్ హైలైన్ - రూ.6.48 లక్షలు
* 1.2 డీజిల్ హైలైన్ - రూ.7.16 లక్షలు

ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఐపిఎల్ ఎడిషన్ 2 ధరలు:
* 1.6 పెట్రోల్ ట్రెండ్‌లైన్ - రూ.7.08 లక్షలు
* 1.6 పెట్రోల్ హైలైన్ - రూ.8.23 లక్షలు
* 1.6 పెట్రోల్ హైలైన్ ఆటోమేటిక్ - రూ.9.21 లక్షలు
* 1.6 డీజిల్ ట్రెండ్‌లైన్ - రూ.8.28 లక్షలు

More from DriveSpark

Article Published On: Tuesday, April 17, 2012, 11:25 [IST]
English summary
The IPL Edition of the Polo and the Vento is as obsessed with cricket as you are. Inside, you’ll find an interactive car pad with multimedia entertainment features that lets you catch every pulsating moment of the IPL.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+