ఐరవైలో ఉండే వారి కన్నా టీనేజర్లే బెస్ట్ డ్రైవర్స్
మెల్‌బోర్న్: టీనేజ్‌లో (17-20 ఏళ్ల లోపులో ఉండే వారు) ఉండే వాళ్లే వరస్ట్ డ్రైవర్లని, మిడిమిడి జ్ఞానంతో వాహనాలు నడుపుతుంటారని సాధారణంగా అందరూ భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది సత్యం కాదు. తాజా గణంగాలను బట్టి గమనిస్తే.. టీనేజర్ల కన్నా ఐరవైలలో (20 ఏళ్లకు పైబడిన యువత) ఉండే వారు వాహనాలు అడ్డదిడ్డంగా, అత్యంత వేగంగా, ప్రమాదకరంగా నడుపుతుంటారని చెబుతున్నాయి.
మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అక్కడి రవాణ మరియు ప్రధాన రహదారుల నివేదిక ప్రకారం, 21-29 ఏళ్ల వయస్సు కలిగి ప్రతి ముగ్గురిలో ఒక్కరు వాహనం నడుపుతున్నప్పుడు ఓవర్‌స్పీడ్, డ్రింక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్‌లో ఉండగా మొబైల్ ఫోన్లను ఉపయోగించటం వంటి పలు కేసుల్లో అడ్డంగా బుక్ అయినట్లు తేలింది.
అదే 30-39 ఏళ్ల వయస్సు కలిగిన వారిని పరిశీలిస్తే ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే స్పీడింగ్ కేసులో బుక్ అయ్యారు. ఇక టీనేజర్ల విషయానికి వస్తే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే ఇలా బుక్ అయిన వారిలో ఉన్నారు. గడచిన సంవత్సరంలో బుక్ అయిన కేసుల ఆధారంగా, అధికారులు ఈ నివేదికను తయారు చేశారు.
డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయిన వారిలో 20 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉన్నట్లు తేలింది. 2011లో సుమారు 9000 మందికి పైగా డ్రింక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 2500 మందికి పైగా 30 ఏళ్లకు పైబడి వారిపై ఈ కేసులు బుక్ అయ్యాయి. ఇక మన దేశపు రోడ్ల విషయానికి వస్తే.. 17-24 ఏళ్లలోపు డ్రైవర్లే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








