మల్లికకు రోల్స్ రాయిస్ కారు ఎందుకు అమ్మనందో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖ్యాతి గాంచిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్ అందిస్తున్న కార్లను సొంతం చేసుకోవాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. కోట్ల ఖరీదు చేసే ఈ కార్లను కొనుగోలు చేయడానికి మీ దగ్గర కోట్లకు కోట్లు అస్తులున్నప్పటికీ, వాటిని సొంతం చేసుకునే అర్హత లేనిదే కంపెనీ వాటిని మీకు విక్రయించదు. అవును, ఇది నిజం! రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లను సొంతం చేసుకోవాలంటే కంపెనీ నిర్ధేశించే నిబంధనలను సంచృప్తిపరస్తే వాటిని విక్రయిస్తుంది.

సాధారణంగా మన దేశంలో రోల్స్ రాయిస్ కార్లను ప్రముఖ సెలబ్రిటీలు మాత్రమే ఉపయోగిస్తుంటారు. రోల్స్ రాయిస్ తమ కస్టమర్లను తామే స్వయంగా ఎన్నుకుంటుంది. చివరకు టెస్ట్ డ్రైవ్ సౌకర్యం కూడా కంపెనీ ఎన్నుకున్న వారికే కల్పిస్తుందే తప్ప ఎవరికి పడితే వారికి అవకాశం ఇవ్వదు. ముఖ్యంగా సోషల్ బ్యాగ్రౌండ్ సరిగ్గా లేని వారికి కంపెనీ అసలు కార్లనే విక్రయించదు.

సాధారణ కస్టమర్లు ఎవరైనా రోల్స్ రాయిస్ కార్లను కొనడానికి షోరూమ్‌కు వెళ్తే వారి స్థాయి, పరపతిలను ఒకటికి పది సార్లు తనిఖీ చేసుకున్న తర్వాతనే కంపెనీ వారిని రిసీవ్ చేసుకుంటుంది. ఒక్కోసారి ప్రొఫైల్ సరిగ్గా లేని సెలబ్రిటీలను కూడా కంపెనీ తిరస్కరించే అవకాశం ఉంది. గతంలో ఓసారి బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మల్లికా షెరావత్ రోల్స్ రాయిస్ కారును కొనడానికి ప్రయత్నిస్తే, కంపెనీ విక్రయించడానికి నిరాకరించిందట.

మరి తరతరాల ఘన చరిత్రను కలిగి రోల్స్ రాయిస్ కార్లను సొంతం చేసుకోవడమంటే చిన్న విషయం కాదు కదా..! బాలీవుడ్ తారలు సంజయ్ దత్, అమితా బచ్చన్, టాలీవుడ్ నడుటు చిరంజీవి వంటి ప్రముఖల వద్ద ఈ బ్రాండ్ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం రోల్స్ రాయిస్ భారత మార్కెట్లో మూడు మోడళ్లను అందిస్తోంది. ఘోస్ట్, ఫాంటమ్, ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ ఘోస్ట్. మన మార్కెట్లో వీటి ధరలు రెండున్నర కోట్ల రూపాయలకు పైమాటే.

More from DriveSpark

Article Published On: Wednesday, March 14, 2012, 19:42 [IST]
English summary
Rolls Royce is a prestigious brand that has made its marque all over the world with its legendary cars. When it comes to selling, the iconic British brand is extremely choosy with its buyers as it cannot be owned by anyone who has the wealth to buy it. It was recently reported that the carmaker refused to sell its car to Bollywood actress Mallika Sherawat.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+