ఆక్టావియాను తిరిగి ఇండియాకు తీసుకురానున్న స్కొడా

లారా స్థానాన్ని రీప్లేస్ చేస్తూ, అత్యంత ప్రజాదరణ పొందిన ఆక్టావియా బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు స్కొడా సన్నాహాలు చేస్తోంది. 'ఏ7' అనే కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ సరికొత్త కారును వచ్చే ఏడాది జరగనున్న జెనీవా మోటార్ షోలో స్కొడా ఆవిష్కరించనుంది. ఈ కారును ఫోక్స్‌వ్యాగన్ మాడ్యులర్ ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా, లారా కన్నా పెద్దదిగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
ఆక్టావియా పేరంటే తనకు చాలా ఇష్టమని, ఇది స్కొడా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కారు అని, ఇది తప్పకుండా ఇండియాకు తిరిగి వస్తుందని ఆటో ఎక్స్‌పో సమయంలో స్కొడా ఉన్నతాధికారి ప్రొఫెసర్ విన్‌ఫ్రెడ్ వాలంద్ అన్నారు. దశాబ్ధ కాలం క్రితం స్కొడా తన ఆక్టావియా బ్రాండ్‌ను విడుదల చేసింది. అప్పట్లో ఈ కారు, భారత మార్కెట్లో స్కొడాను లగ్జరీ కార్ బ్రాండ్‌గా నిలిపేందుకు సహకరించింది. గడచిన జులై నెలలో స్కొడా ఆక్టావియా ఉత్పత్తిని కంపెనీ పూర్తిగా నిలిపివేసింది.


Click it and Unblock the Notifications








