XUV500కి హ్యాపీ బర్త్‌డే చెప్పండి, చీతా సఫారీని గెలుచుకోండి

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ మోడల ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' మార్కెట్లోకి వచ్చి అప్పుడే ఒక సంవత్సరం పూర్తయిపోయింది. భారతీయ వినియోగదారుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఎక్స్‌యూవీ500 మార్కెట్లో విడులై రేపటితో సరిగ్గా ఏడాది కానుంది.

గడచిన సెప్టెంబర్ 28న మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 మార్కెట్లో విడదలై ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా కంపెనీ ఓ ప్రత్యేక క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపైన్‌లో భాగంగా, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, లక్కీ డ్రా గెలుపొందిన వారికి ఆఫ్రికాలో చీతా సఫారీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

XUV500

చిరుత పులి (చీతా) నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ ఈ ఎస్‌యూవీని తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి బర్త్ డే విషెష్ చెప్పాలంటే 18002004646 ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని కంపెనీ పేర్కొంది. ఇలా శుభాకాంక్షలు తెలిపిన వారిలో లక్కీ డ్రాను తీసి, ఇందులో గెలుపొందిన వారికి ఆఫ్రికాలో చీతా సఫారీని ఆఫర్ చేస్తామని కంపెనీ ప్రకటించింది.

ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ500 మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6, డబ్ల్యూ8, డబ్ల్యూ8 ఆల్-వీల్ డ్రైవ్) లభ్యమవుతోంది. ఇందులో 2179సీసీ ఎమ్-హాక్140 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 వేరియంట్లు, ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 - రూ.11.79 లక్షలు
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.13.32 లక్షలు
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) - రూ. 14.12 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Friday, September 28, 2012, 17:23 [IST]
English summary
Mahindra had launched its premium SUV, the XUV 500 just about one year ago. In fact the company had unveiled the XUV 500 on September 28th and had then revealed its technical specifications and pricing on September 29th 2011. So technically September 28 is the XUV 500's birthday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+