ఎక్స్‌యూవీ500 వల్ల ఆరియాకు నష్టం లేదు: టాటా మోటార్స్

మహీంద్రా ఎక్స్‌యూవీ500 విడుదల తర్వాతనే టాటా ఆరియా అమ్మకాలు ఊపందుకున్నాయని కంపెనీ తెలిపింది. గతంలో 200 యూనిట్ల టాటా ఆరియా ప్రీమియం క్రాసోవర్‌లను విక్రయిస్తుండగా, ప్రస్తుతం 500 యూనిట్లను విక్రయిస్తున్నామని టాటా మోటార్స్ యుటిలిటీ వెహికల్స్ ప్రోడక్ట్ గ్రూప్ - హెడ్ అశీష్ ధార్ తెలిపారు.
కాగా.. టాటా మోటార్స్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్‌యూవీ "సుమో గోల్డ్"ను ప్రతి నెలా 5,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సుమో కన్న టాటా సుమో గోల్డ్ రూ.40,000 చవకైనది. అంతేకాకుండా ఇది కొత్త టాటా సిఆర్4 ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ అధిక మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








