సెకండ్ ఫేజ్‌లో ఎక్స్‌యూవీ500కు 25,000 యూనిట్లకు ఆర్డర్లు

ఈ మోడల్‌కు తొలి విడిత బుకింగ్‌లను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మూడు నెలలకు సరిపడా ఉత్పత్తి ఒకేసారి అమ్ముడు పోయింది. దీంతో కొంత కాలం బుకింగ్‌లు నిలిపి వేసి తాజాగా జనవరి 25 సెకండ్ ఫేజ్ బుకింగ్‌లను ప్రారంభించిన కంపెనీకు, కేవలం పది రోజుల్లోనే ఏకంగా 25,000 యూనిట్లకు ఆర్డర్లు వచ్చిపడ్డాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాల డెలివరీలో పారదర్శకతను పాటించేందుకు గానూ బుకింగ్‌లు 7,200 యూనిట్లను దాటినట్లయితే లక్కీడ్రా ప్రాతిపదికన కొనుగోలు దారులను ఎంపిక చేస్తామని ఎమ్ అండ్ ఎమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీంతో ఎంతో ఆశగా బుకింగ్‌లు చేసుకున్న వారి ఆశలు అడియాసలుగానే మిగలనున్నాయి. ఇంత మందిలో లక్కీ డ్రా ఎవరికి వస్తుందో.. ఎక్స్‌యూవీ500 ఎవరిని వరిస్తుందోనని కొనుగోలుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 3,000 యూనిట్లకు పెంచినట్లు కంపెనీ తెలిపింది. ఏదేమైనప్పటికీ.. రజనీ కాంత్ స్టైల్‌లో లేట్‌గా వచ్చినా లేటెస్టుగా వస్తా.. అంటూ ప్రవేశించిన ఎక్స్‌యూవీ500 భారత మార్కెట్లో గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








