2013 ఆడి ఆర్ఎస్5 విడుదల; ధర రూ.95.28 లక్షలు
జర్మన్ కార్ కంపెనీ ఆడి ఇండియా తమ అధునాతన 2013 ఆర్ఎస్5 లగ్జరీ కారును నేడు మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ సరికొత్త ఆడి ఆర్ఎస్5 మోల్ ధర రూ.95.28 లక్షలు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉంది. రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్లను 2013 మోడల్‌లో గమనించవచ్చు. అయితే యాంత్రికపరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు.
కొత్త 2013 ఆడి ఆర్ఎస్5 లగ్జరీ స్పోర్ట్స్ కారులో ఉపయోగించిన 4.2 లీటర్, వి8 ఇంజన్ గరిష్టంగా 444 పిఎస్‌ల శక్తిని, 430 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఎస్-ట్రానిక్స్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‍తో జతచేయబడి ఉంటుంది. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే ఈ కారు కేవలం 4.5 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 280 కి.మీ.

కొత్త 2013 ఆడి ఎర్ఎస్5 కూపేతో ఫొటోలకు ఫోజిలిస్తున్న ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ.

కొత్త 2013 ఆడి ఎర్ఎస్5 విడుదల కార్యక్రమానికి రేస్ డ్రైవర్ ఆదిత్యా పటేల్ కూడా హాజరయ్యారు.

కొత్త 2013 ఆడి ఎర్ఎస్5 కూపేలో సరికొత్త ట్రాపేజాయిడ్ హెడ్‌లైట్స్, రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్‌ను గమనించవచ్చు.

ముందు వైపు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన కొత్త జెనాన్ ప్లస్ హెడ్‌లైట్లు ఈ కారులో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

కారు వేగం గంటకు 120 కీ.మీ. దాటగానే రియర్ స్పాయిలర్ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి, మరింత డౌన్‌ఫోర్స్‌ను అందిస్తుంది.

ఆడి పార్కింగ్ సిస్టమ్ ప్లస్, ఈఎస్‌పి, హై పెర్ఫామెన్స్ 14.4 ఇంచ్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్, ఏబిఎస్, స్పోర్ట్ వంటి విస్తృత స్థాయి సేఫ్టీ ఫీచర్లతో కొత్త 2013 ఆడి ఎర్ఎస్5 లభిస్తుంది.





Click it and Unblock the Notifications








