2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే డీజిల్ కార్ల ధర, మెయింటినెన్స్‌లు అధికంగా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులు ప్రధానంగా అధిక మైలేజీని ఆఫర్ చేసే డీజిల్ కార్ల వైపే మొగ్గుచూపుతుంటారు. ప్రస్తుతం మన దేశంలో డీజిల్ కార్ల ట్రెండ్ నడుస్తోంది. ధరెక్కువైనా వీటిని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వెనుకాడటం లేదు. అయితే, అన్ని డీజిల్ కార్లు ఉత్తమ డీజిల్ కార్లు కాలేవు. మరి ఆ ఉత్తమ డీజిల్ కార్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
యూకెకు చెందిన 'డీజిల్ కార్ మ్యాగజైన్' 2013 సంవత్సరానికి గాను ఉత్తమ డీజిల్ కార్ల వివరాలను వెల్లడి చేసింది. ఈ మేరకు డీజిల్ కార్ మ్యాగజైన్ తమ 25వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని '2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'లను ప్రకటించింది. పది వాహన సెగ్మెంట్లలో ఈ అవార్డులను ప్రకటించారు.
ఈ అవార్డుల కోసం మొత్తం 26 కార్లు షార్ట్‌లిస్ట్ కాగా అందులో ఫోక్స్‍వ్యాగన్ గోల్ఫ్ '2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్' గాను అలాగే 'బెస్ట్ మీడియం కార్' గాను అవార్డులను దక్కించుకుంది. ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో అందిస్తున్న రెనో జో 'బెస్ట్ ఈకో కార్' అవార్డును సంపాధించుకుంది.
ల్యాండ్ రోవర్ అందిస్తున్న రేంజ్ రోవర్ ఎవోక్ 'బెస్ట్ క్రాసోవర్' అవార్డును సొంతం చేసుకోగా ల్యాండర్ రోవర్ డిస్కవరీ 4 'బెస్ట్ 4x4' టైటిల్‌ను దక్కించుకుంది. గ్లోబల్ మార్కెట్లలో హ్యాచ్‌బ్యాక్ రూపంలో లభిస్తున్న ఫోర్డ్ ఫియస్టా 'బెస్ట్ స్మాల్ కార్' అవార్డును కంపెనీ అందిస్తున్న బి-మ్యాక్స్ 'బెస్ట్ ఎమ్‌పివి' అవార్డులను సొంతం చేసుకుంది. మరిన్ని బెస్ట్ డీజిల్ కార్లను ఈ ఫొటో ఫీచర్‌లోపరిశీలిద్దాం రండి..!

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ స్మాల్ కార్ - ఫోర్డ్ ఫియస్టా

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ మీడియం కార్ - ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ లార్జ్ కార్ - బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ ఎగ్జిక్యూటివ్ కార్ - జాగ్వార్ ఎక్స్ఎఫ్

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ ఎస్టేట్ కార్ - కియా సీడ్ స్పోర్ట్స్‌వ్యాగన్

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ ఎమ్‌పివి - ఫోర్డ్ బి-మ్యాక్స్

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ క్రాసోవర్ - రేంజ్ రోవర్ ఎవోక్

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ 4x4 - ల్యాండ్ రోవర్ డిస్కవరీ 4

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ స్పోర్ట్స్ కార్ - ప్యూజో ఆర్‌సిజెడ్

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
బెస్ట్ ఈకో కార్ - రెనో జో

2013 డీజిల్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలు వెల్లడి
కార్ ఆఫ్ ది ఇయర్ 2013 - ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్

Click it and Unblock the Notifications