2013 ఫియట్ లీనియా టి-జెట్ విడుదల: ధరలు, ఫీచర్లు

ఇటలీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫియట్ ఇండియా, తమ పెర్ఫామెన్స్ వెర్షన్ సెడాన్ 'లీనియా టి-జెట్‌' తిరిగి భారత మార్కెట్లో విడుదల చేసింది. టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన 2013 ఫియట్ లీనియా టి-జెట్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. అవి:

  • ఫియట్ లీనియా టి-జెట్ యాక్టివ్ - రూ.7.60 లక్షలు
  • ఫియట్ లీనియా టి-జెట్ డైనమిక్ - రూ.8.40 లక్షలు
  • ఫియట్ లీనియా టి-జెట్ ఎమోషన్ - రూ.8.80 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఫియట్ లీనియా టి-జెట్ యాక్టివ్ వేరియంట్లో ఏబిఎస్, ఈబిడి, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఆటో ఆన్/ఆఫ్ ల్యాంప్స్, అన్ని చక్రాలలో డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

లీనియా టి-జెట్ డైనమిక్ వేరియంట్లో పైన తెలిపిన ఫీచర్లకు అధనంగా రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు లభిస్తాయి.

టి-జెట్ ఎమోషన్ వేరియంట్‌లో పై రెండు వేరియంట్లలో తెలిపిన ఫీచర్లకు అదనంగా, లెథర్ సీట్లు, రియర్ సీట్ కర్టెన్లు, బంపర్లపై క్రోమ్ ట్రిమ్, 16-ఇంచ్ వీల్స్, వెడల్పాటి 205 సెక్షన్ టైర్లు మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

Fiat Linea T Jet

ఫియట్ లీనియా టి-జెట్ వేరియంట్‌లో 1.4 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 114 పిఎస్‌ల శక్తిని, 2200 ఆర్‌పిఎమ్ వద్ద 207 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 15.7 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెన పేర్కొంది. ఓషియానిక్ బ్లూ, టస్కన్ వైట్, న్యూ పెరల్ వైట్, హిప్ హాప్ బ్లాక్ మరియు మినిమల్ గ్రే అనే ఐదు ఆకర్షనీయమైన రంగులలో ఇది లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 10, 2013, 20:28 [IST]
English summary
Fiat India has launches the Linea T-Jet with more features in three variants with prices ranging from Rs 7.60 lakh to Rs 8.80 (ex-showroom Delhi). Fiat Linea T-Jet is powered by 1.4 L Turbo Charged petrol engine which makes 114 PS at 5000 RPM and 207 Nm of torque at 2200 RPM. This engine is mated to 5 sped Manual Gearbox.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+