2013 జెనీవా మోటార్ షో: డస్టర్ అడ్వెంచర్ వెర్షన్ విడుదల
ఈ ఫోటోలను చూస్తుంటే ఏమైనా గుర్తుకొస్తుందా..? ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'డాసియా డస్టర్'ను భారత మార్కెట్లో 'రెనో డస్టర్' పేరుతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. (డాసియా రెనోకు చెందిన కార్ బ్రాండ్). డస్టర్ ఎస్‌యూవీలో ఓ లిమిటెడ్ ఎడిషన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది కార్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి ఆశలను నిజం చేస్తూ డాసియా ఓ సరికొత్త స్పెషల్ ఎడిషన్ డస్టర్‌ను పరిచయం చేసింది.
ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో డాసియా తమ సరికొత్త డస్టర్ అడ్వెంచర్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. డస్టర్ అడ్వెంచర్ తెలుపు, నలుపు రంగులలో మాత్రమే లభిస్తుంది. సాధారణ డస్టర్‌తో పోల్చుకుంటే, ఈ డస్టర్ అడ్వెంచర్‌లో మెరిసే నలుపు రంగులో కూడిన 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డస్టర్‌కు పైభాగాన అమర్చుకునే/తొలగించుకునే వీలున్న అడిషనల్ రిమూవబల్ ర్యాంప్ లైట్స్, జిపిఎస్‌తో కూడిన గార్మిన్ 350ఎల్ఎమ్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.
అంతేకాకుండా, కారుకు ముందువైపు అలాగే వెనుకవైపు అంటించిన డస్టర్ అడ్వెంచర్ స్టిక్కర్స్, ముందు మరియు వెనుక అమర్చిన కొత్త స్కిడ్ ప్లేట్స్, టింట్ చేయబడిన రియర్ క్వార్టర్ ప్యానెల్స్ మరియు విండోస్ వంటి ఫీచర్లను అదనంగా పొందవచ్చు. డస్టర్ అడ్వెంచర్ టూ-వీల్ డ్రైవ్ (4X2), ఫోర్-వీల్ డ్రైవ్ (4X4) ఆప్షన్లతో లభ్యం కానుంది. రెనో డస్టర్ భారత మార్కెట్లో విడుదలైన కొద్ది రోజులకే మంచి పాపులారిటీని సంపాధించుకుంది. ఈ నేపథ్యంలో రెనో ఇండియా ఈ లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్‌ను దేశీయ విపణిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆలస్యమెందుకు.. డస్టర్ అడ్వెంచర్‌ను చూసేద్దాం రండి..!

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్

లిమిటెడ్ ఎడిషన్ డస్టర్ అడ్వెంచర్



Click it and Unblock the Notifications








