సరికొత్త 2013 వ్యాగన్ఆర్‌ను విడుదల చేసిన మారుతి సుజుకి
సరికొత్త 2013 వ్యాగన్ఆర్ గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ గతంలో విభిన్న కథనాల్లో ప్రచురించిన విధంగానే, మారుతి సుజుకి తమ సరికొత్త అప్‌గ్రేడెడ్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.3.58 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభ్యమయ్యే ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వ్యాగన్ఆర్ కారులో కంపెనీ అనేక మార్పలు చేర్పులు చేసింది. పాత వెర్షన్ వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే కొత్త వెర్షన్ వ్యాగన్ఆర్ కారు ఫ్రంట్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి.
ఇందులో సన్నటి ఫ్రంట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, రీడిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, సరికొత్త ఫ్రంట్ బంపర్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ వేరియంట్లలో మరింత అధనపు క్రోమ్ కోటింగ్‌ను గమనించవచ్చు. మొత్తమ్మీద దీని ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, మారుతి సుజుకి తాజాగా ఆఫర్ చేస్తున్న స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా స్టయిలింగ్‌ను పోలి ఉంటుంది. అలాగే ఇంటీరియర్లలో కూడా మార్పులు చేయబడ్డాయి. 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఇంటీరియర్స్ డ్యూయెల్ కలర్ (రెండు రంగుల కలయిక) ఆప్షన్‌తో లభిస్తోంది.

2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్
కేవలం రూ.3.58 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మరిన్ని అదనపు మార్పులు చేర్పులు చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను మారుతి సుజుకి మారుతి సుజుకి మార్కెట్లోకి విడుదల చేసింది. పాత వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే, ఇందులో సన్నటి ఫ్రంట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, రీడిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, సరికొత్త ఫ్రంట్ బంపర్ వంటి మార్పులను గమనించవచ్చు.

2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్
2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఇంటీరియర్స్ డ్యూయెల్ కలర్ (రెండు రంగుల కలయిక) ఆప్షన్‌తో లభిస్తోంది. ఇందులో డ్యాష్‌బోర్డును పైవైపు అర్థ భాగాన్ని బీజ్ కలర్‌తోను, క్రింది వైపు అర్థ భాగాన్ని నలుపు రంగుతోను తీర్చిదిద్దారు.

2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్
ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ వేరియంట్లలో డ్యూయెల్ కలర్ బీజ్-బ్లాక్ సీట్లను ఉపయోగించారు. టాప్-ఎండ్ వేరియంట్ విఎక్స్ఐలో పూర్తిగా బీజ్ కలర్ సీట్లను ఉపయోగించారు. ఈ వేరియంట్‌లో యూఎస్‌బి కనెక్టివిటీతో కూడిన సరికొత్త 'ఈగల్ వింగ్స్' ఆడియో సిస్టమ్‌ను అమర్చారు.

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్
ఇన్ని అదనపు ఫీచర్లు కలిగిన సరికొత్త 2013 వ్యాగన్ఆర్ పాత వెర్షన్ కన్నా కేవలం రూ.10,000 లు మాత్రమే అధికం. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే సరికొత్త 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్: రూ. 3.58 లక్షలు
* 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ: రూ. 3.88 లక్షలు
* 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ విఎక్స్ఐ: రూ. 4.13 లక్షలు
* 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ (సిఎన్‌జి): రూ. 4.42 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్
పాత వ్యాగన్ఆర్ ఇంటీరియర్స్

2012 మారుతి సుజుకి వ్యాగన్ఆర్
పాత వ్యాగన్ఆర్ ఇంటీరియర్స్
ఇందులో డ్యాష్‌బోర్డును పైవైపు అర్థ భాగాన్ని బీజ్ కలర్‌తోను, క్రింది వైపు అర్థ భాగాన్ని నలుపు రంగుతోను తీర్చిదిద్దారు. ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ వేరియంట్లలో డ్యూయెల్ కలర్ బీజ్-బ్లాక్ సీట్లను ఉపయోగించారు. టాప్-ఎండ్ వేరియంట్ విఎక్స్ఐలో పూర్తిగా బీజ్ కలర్ సీట్లను ఉపయోగించారు. ఈ వేరియంట్‌లో యూఎస్‌బి కనెక్టివిటీతో కూడిన సరికొత్త 'ఈగల్ వింగ్స్' ఆడియో సిస్టమ్‌ను అమర్చారు. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే సరికొత్త 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్: రూ. 3.58 లక్షలు
* 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ: రూ. 3.88 లక్షలు
* 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ విఎక్స్ఐ: రూ. 4.13 లక్షలు
* 2013 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ (సిఎన్‌జి): రూ. 4.42 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వ్యాగన్ఆర్‌లో ఉపయోగించిన 1.0 లీటర్, 3-సిలిండర్ కెబి10 కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త వ్యాగన్ఆర్ మైలేజ్‌ను దాదాపు 8 శాతం మేర పెంచడం జరిగింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది గరిష్టంగా లీటరుకు 20.51 కి.మీ. మైలేజీనిస్తుంది. ధర పరంగా చూసుకుంటే, ఇన్ని అదనపు ఫీచర్లు కలిగిన సరికొత్త 2013 వ్యాగన్ఆర్ పాత వెర్షన్ కన్నా కేవలం రూ.10,000 లు మాత్రమే అధికం.


Click it and Unblock the Notifications








