హైదరాబాద్ మార్కెట్లో 2013 నిస్సాన్ మైక్రా విడుదల
నిస్సాన్ ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన నిస్సాన్ మైక్రా యాక్టివ్ మరియు 2013 మైక్రా మోడళ్లు ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. గడచిన శనివారం నిస్సాన్ ఇండియా తమ కొత్త కార్లను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా హోవర్ ఆటోమోటివ్ ఇండియా (హెచ్ఎఐ) వైస్ ప్రెసిడెంట్ సునీల్ మద్దాల మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా స్పోర్టీ లుక్, ప్రీమియం ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచరల్తోఈ కొత్త వేరియంట్లను రూపొందించామని చెప్పారు.
రాష్ట్ర మార్కెట్లో 2013 నిస్సాన్ మైక్రా ధరలు ఇలా ఉన్నాయి:
పెట్రోల్ వేరియంట్లు, ధరలు
- నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ - రూ.4.88 లక్షలు
- నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ (ఆప్షనల్) - రూ.5.52 లక్షలు
- నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి (ఆటోమేటిక్) - రూ.6.50 లక్షలు
డీజిల్ వేరియంట్లు, ధరలు
- నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ - రూ.6.10 లక్షలు
- నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ (ఆప్షనల్) - రూ.6.6.54 లక్షలు
- నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి - రూ.7.01 లక్షల
- నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి ప్రీమియం - రూ.7.26 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)









కొత్త హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, బంపర్లతో రీడిజైన్ చేయబడిన సరికొత్త ఫ్రంట్ ప్రొఫైల్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, కొత్త బంపర్‌తో కూడిన సరికొత్త రియర్ ప్రొఫైల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రధాన మార్పులుగా చెప్పుకోవచ్చు. గ్లాసీ బ్లాక్ ఫినిష్‌తో కూడిన సెంటర్ కన్సోల్, డ్యాష్‌బోర్డ్, డోర్‌ప్యాడ్స్ సిల్వర్ ఫినిష్, కీలెస్ ఎంట్రీ, క్లైమేట్ కంట్రోల్, బ్లూటూత్, యూఎస్‌బి, రివర్సింగ్ కెమెరాతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లను కొత్త 2013 నిస్సాన్ మైక్రాలో జోడించారు.
ఇంజన్ పరంగా కొత్త మైక్రాలో ఎలాంటి మార్పులు లేవు. మునుపటి వెర్షన్లలో ఉపయోగించిన ఇంజన్లనే ఈ కొత్త వెర్షన్‌లోను ఉపయగించారు. అయితే, ఇందులో కొత్తగా పెట్రోల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేశారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన కొత్త మైక్రా లీటర్‌కు 18.44 కిలోమీటర్ల మైలేజీని, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ లీటర్‌కు 23.08 కిలో మీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, ఎక్స్‌ట్రానిక్స్ సివిటి గేర్‌బాక్స్ కలిగి ఆటోమేటిక్ వేరియంట్ మైక్రా లీటరు పెట్రోలుకు 19.34 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








