2013 నిస్సాన్ మైక్రా విడుదల: ధరలు, ఫీచర్లు

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, తమ అధునాతన మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. మునపటి వెర్షన్‌తో పోల్చుకుంటే డిజైన్ మరియు ఫీచర్ల పరంగా మరింత మెరుగ్గా ఉండేలా అప్‌గ్రేడ్ చేసిన 2013 నిస్సాన్ మైక్రా ప్రారంభ ధర రూ.4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, మైక్రాలో వ్యాల్యూ ప్యాక్డ్ మైక్రా యాక్టివ్ అనే ఓ చవక వేరియంట్‌ను కూడా కేవలం రూ.3.50 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)ధరకే కంపెనీ ఆఫర్ చేస్తోంది.

కొత్త 2013 నిస్సాన్ మైక్రాలో ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇందులో ఎక్స్‌ట్రానిక్స్ సివిటి గేర్‌బాక్సును ఉపయోగించారు. ఫలితంగా ఇది లీటరు పెట్రోలుకు 19.34 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఆటోమేటిక్ వేరియంట్ కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. కొత్త మైక్రాలో ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇదివరకటి వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఇందులోను ఉపయోగించారు.

కొత్త హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, బంపర్లతో రీడిజైన్ చేయబడిన సరికొత్త ఫ్రంట్ ప్రొఫైల్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, కొత్త బంపర్‌తో కూడిన సరికొత్త రియర్ ప్రొఫైల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రధాన మార్పులుగా చెప్పుకోవచ్చు. గ్లాసీ బ్లాక్ ఫినిష్‌తో కూడిన సెంటర్ కన్సోల్, డ్యాష్‌బోర్డ్, డోర్‌ప్యాడ్స్ సిల్వర్ ఫినిష్, కీలెస్ ఎంట్రీ, క్లైమేట్ కంట్రోల్, బ్లూటూత్, యూఎస్‌బి, రివర్సింగ్ కెమెరాతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లను కొత్త 2013 నిస్సాన్ మైక్రాలో జోడించారు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

ప్రారంభ ధర

ప్రారంభ ధర

మునపటి వెర్షన్‌తో పోల్చుకుంటే డిజైన్ మరియు ఫీచర్ల పరంగా మరింత మెరుగ్గా ఉండేలా అప్‌గ్రేడ్ చేసిన 2013 నిస్సాన్ మైక్రా ప్రారంభ ధర రూ.4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

చవక వేరియంట్

చవక వేరియంట్

మైక్రాలో వ్యాల్యూ ప్యాక్డ్ మైక్రా యాక్టివ్ అనే ఓ చవక వేరియంట్‌ను కూడా కేవలం రూ.3.50 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)ధరకే కంపెనీ ఆఫర్ చేస్తోంది. మునపటి వెర్షన్ మైక్రాలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి యాక్టివ్ వేరియంట్‌గా పునఃపరిచయం చేసింది.

పెట్రోల్ వేరియంట్లు, ధరలు

పెట్రోల్ వేరియంట్లు, ధరలు

నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ - రూ.4.79 లక్షలు

నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ (ఆప్షనల్) - రూ.5.42 లక్షలు

నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి (ఆటోమేటిక్) - రూ.6.39 లక్షలు

డీజిల్ వేరియంట్లు, ధరలు

డీజిల్ వేరియంట్లు, ధరలు

నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ - రూ.5.90 లక్షలు

నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ (ఆప్షనల్) - రూ.6.43 లక్షలు

నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి - రూ.6.90 లక్షల

నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి ప్రీమియం - రూ.7.14 లక్షలు

2013 నిస్సాన్ మైక్రా విడుదల

More from DriveSpark

Article Published On: Wednesday, July 3, 2013, 13:22 [IST]
English summary
Nissan India has launch the all-new 2013 Micra today. The refreshed Micra also comes with a new CVT automatic gearbox in petrol version. Prices for New Micra start at Rs. 4.79 lakh & Value Packed Micra Active from Rs. 3.50 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+