జులై 3న మార్కెట్లోకి రానున్న 2013 నిస్సాన్ మైక్రా
చిన్న కారు కొనాలకునే వారికి శుభవార్త. జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ అందిస్తున్న బుజ్జి కారు మైక్రాలో ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మైక్రా కన్నా మరింత మెరుగైన మైక్రాను జులై 3, 2013న నిస్సాన్ ఇండియా విడుదల చేయనుంది. కొత్త 2013 నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి.
ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే, అల్లాయ్ వీల్స్, రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, బంపర్, ఫాగ్ ల్యాంప్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, వెనుక వైపు డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు. కొత్త ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, బంపర్, రివైజ్డ్ టెయిల్ గేట్ వంటి మార్పులను వెనుక వైపు గమనించవచ్చు.
ఇకపోతే ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. మునపటి వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఈ కారులోను ఉపయోగించారు. కాగా.. ఈ కొత్తగా వస్తున్న 2013 నిస్సాన్ మైక్రా పెట్రోల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (ఆటోమేటిక్ గేర్‌బాక్స్) ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. ఇటీవలే నిస్సాన్ ఈ కొత్త మైక్రాను థాయ్‌లాండ్, యూకే మార్కెట్లలో ఆవిష్కరించింది. అదే మైక్రా ఇప్పుడు ఇండియాలో విడుదల అవుతోంది.
కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఐ10, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిస్సాన్ ఇండియా ఓ తక్కువ ధర కలిగిన మైక్రాను కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త 2013 నిస్సాన్ మైక్రాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి. ఈలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2013 నిస్సాన్ మైక్రా ప్రత్యేకతలేంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!






















Click it and Unblock the Notifications








