అక్టోబర్‌లో భారత్‌కు రానున్న 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్
ఈ కొత్త 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్ గుర్తుందా..? భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ ఎస్‌యూవీ బ్రాండ్ 'ల్యాండ్ రోవర్' ఈ ఏడాది మార్చ్ నెలలో జరిగిన 2013 న్యూయార్క్ ఆటో షోలో ఆవిష్కరించిన 'రేంజ్ రోవర్ స్పోర్ట్' (Range Rover Sport) ఎస్‌యూవీని త్వరలోనే ల్యాండ్ రోవర్ భారత్‌లో కూడా విడుదల చేయనుంది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, అక్టోబర్ 17న ఈ 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్ దేశీయ విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ మోడల్ రాకతో రేంజ్ రోవర్ సిరీస్‌లో భిస్తున్న ఎస్‌యూవీ మోడళ్ల సంఖ్య మూడుకు చేరింది. ల్యాండర్ రోవర్ ఇప్పటికే, రేంజ్ రోవర్ సిరీస్‌లో 'రేంజ్ రోవర్', 'రేంజ్ రోవర్ ఎవోక్' అనే మోడళ్లను అందిస్తున్న సంగతి తెలిసిదే.
జేమ్స్ బాండ్ పాత్ర పోషించే హాలీవుడ్ నటుడు డానియేల్ క్రైగ్, 2013 న్యూయార్క్ ఆటో షోలో ఈ సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను ఆవిష్కరించారు. 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్పోర్టీ వెర్షన్
రేంజ్ రోవర్ సిరీస్‌లో మరింత స్పోర్టీ వెర్షన్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీనిని రూపొందించింది. రెగ్యులర్ రేంజ్ రోవర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఈ కొత్త వేరియంట్‌ను తయారు చేశారు.

లైట్ వెయిట్
రెగ్యులర్ రేంజ్ రోవర్‌తో పోల్చుకుంటే రేంజ్ రోవర్ స్పోర్ట్ 420 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇది 4850 మి.మీ. పొడవును, 278 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్
ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలో ల్యాండ్ రోవర్ యొక్క 'టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్'ను జోడించారు.

గ్లోబల్ వెర్షన్ ఇంజన్ ఆప్షన్స్
అంతర్జాతీయంగా ఇది నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అవి, 510 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్, 340 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి6 పెట్రోల్ ఇంజన్, 258 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 టిడివి6 డీజిల్ ఇంజన్ మరియు 292 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 ఎస్‌డివి6 డీజిల్ ఇంజన్.

ఇండియన్ వెర్షన్ ఇంజన్ ఆప్షన్స్
అయితే, భారత్‌లో మాత్రం ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో మాత్రమే లభ్యం కానుంది. అవి, 266 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 510 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్.

ట్రాన్సిమిషన్
3.0 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌లు రెండు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో (8 ఆటోమేటిక్ గేర్లు) లభ్యం కానున్నాయి.

సిబియూ రూట్
కొత్త 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీని ఇండియాకు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకోనున్నారు. ఫలితంగా దేశీయ విపణిలో దీని ధర రూ.1 కోటి రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








