భారత్‌లో 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను విడుదల చేసిన ల్యాండ్ రోవర్
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ 'ల్యాండ్ రోవర్' ఈ అక్టోబర్ 17న తమ కొత్త 2013 'రేంజ్ రోవర్ స్పోర్ట్' (Range Rover Sport) లగ్జరీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గడచిన నెలలో ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసినదే. మేము రిపోర్ట్ చేసినట్లుగా, ల్యాండ్ రోవర్ తమ 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను గురువారం మార్కెట్లే ప్రవేశపెట్టింది.
భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ ఎస్‌యూవీ బ్రాండ్ ల్యాండ్ రోవర్ ఈ ఏడాది మార్చ్ నెలలో జరిగిన 2013 న్యూయార్క్ ఆటో షోలో కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ మోడల్ రాకతో రేంజ్ రోవర్ సిరీస్‌లో భిస్తున్న ఎస్‌యూవీ మోడళ్ల సంఖ్య మూడుకు చేరుకుంది. ల్యాండర్ రోవర్ ఇప్పటికే, రేంజ్ రోవర్ సిరీస్‌లో 'రేంజ్ రోవర్', 'రేంజ్ రోవర్ ఎవోక్' అనే మోడళ్లను అందిస్తోంది
జేమ్స్ బాండ్ పాత్ర పోషించే హాలీవుడ్ నటుడు డానియేల్ క్రైగ్, 2013 న్యూయార్క్ ఆటో షోలో ఈ సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను ఆవిష్కరించారు. భారత్‌లో 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర, మరియు ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

స్పోర్టీ వెర్షన్
రేంజ్ రోవర్ సిరీస్‌లో మరింత స్పోర్టీ వెర్షన్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీనిని రూపొందించింది. రెగ్యులర్ రేంజ్ రోవర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఈ కొత్త వేరియంట్‌ను తయారు చేశారు.

లైట్ వెయిట్
రెగ్యులర్ రేంజ్ రోవర్‌తో పోల్చుకుంటే రేంజ్ రోవర్ స్పోర్ట్ 420 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇది 4850 మి.మీ. పొడవును, 278 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

7 సీటర్
కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ 7సీటర్ ఆప్షన్ (5+2)తో లభిస్తుంది. మూడవ వరుసలోని సీట్లను యాంత్రికంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇవి పిల్లకు అనువుగా ఉంటాయి.

టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్
ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌యూవీలో ల్యాండ్ రోవర్ యొక్క 'టెర్రైన్ రెస్పాన్స్ 2 సిస్టమ్'ను జోడించారు.

ఇంజన్ ఆప్షన్స్
అంతర్జాతీయంగా ఇది నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే, ఇండియాలో మాత్రం రెండింటిని మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అవి, 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్, 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్.

పవర్, ట్రాన్సిమిషన్
3.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 266 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 510 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి.

పెర్ఫామెన్స్
డీజిల్ వెర్షన్ రేంజ్ రోవర్ స్పోర్ట్ 7.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, దీని గరిష్ట వేగం గంటకు 222 కి.మీ. పెట్రోల్ వెర్షన్ 5.3 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.

మైలేజ్
3.0 లీటర్ డీజిల్ ఇంజన్ లీటరుకు 13.33 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని, అలాగే 5.0 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజన్ లీటరుకు 7.81 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

వేరియంట్స్
సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకుంటున్న కొత్త 2013 రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీ ఎస్, ఎస్ఈ, హెచ్ఎస్ఈ, ఆటోబయోగ్రఫీ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

ధరలు
దేశీయ విపణిలో కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధరలు రూ.1.09 కోట్ల (వి6 డీజిల్) నుంచి రూ.1.65 కోట్ల (వి8 పెట్రోల్) రేంజ్‌లో ఉన్నాయి. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై).


Click it and Unblock the Notifications








