భారత్‌లో 2013 స్కొడా ఆక్టావియా బుకింగ్స్ ప్రారంభం!
చెక్-రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా, ఈనెల ఆరంభంలో (ఆగస్ట్ 9, 2013న) కొత్త 2013 స్కొడా ఆక్టావియా సెడాన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇప్పటికే ఔరంగాబాద్‌లో ఉన్న ప్లాంట్‌లో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న ఈ కారును రానున్న పండుగ సీజన్‌లో వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో, తాజా అప్‌డేట్ ప్రకారం, ఇప్పటికే కొందరు స్కొడా డీలర్లు కొత్త ఆక్టావియా కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక లక్ష రూపాయలను డిపాజిట్ చేసి, కొత్త స్కాడా ఆక్టావియాను బుక్ చేసుకోవచ్చు. ఆకర్షనీయమైన డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విశాలమైన స్పేస్, సౌకర్యవంతమైన టెక్నాలజీ, ఇంటెలిజెంట్ ఫీచర్లతో స్కొడా తమ 2013 ఆక్టావియా సెడాన్‌ను అభివృద్ధి చేసింది.
కొత్త స్కొడా ఆక్టావియా సెడాన్‌ను ఫోక్స్‌వ్యాగన్ నుంచి పాపులర్ అయిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది ప్రస్తుతం స్కొడా నుంచి మార్కెట్లో లభిస్తున్న ప్రీమియం సెడాన్ లారా కన్నా 90 మి.మీ. ఎక్కువ పొడవును, 45 మి.మీ. ఎక్కువ వెడల్పును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 2686 మి.మీ.గా ఉంటుంది. ప్రస్తుత ఆక్టావియా (2013 మోడల్) 3వ తరానికి (థర్డ్ జనరేషన్)కు చెందినది.
2013 స్కొడా ఆక్టావియా సెడాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అంచనా ధర
స్కొడా ఆక్టావియా ధరను కంపెనీ ఇంకా అధికారకంగా వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, పెట్రోల్ వెర్షన్ స్కొడా ఆక్టావియా ధర రూ.14 లక్షలు, డీజిల్ వెర్షన్ ఆక్టావియా ధర రూ.18 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఇంజన్స్
కొత్త 2013 స్కొడా ఆక్టావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. అందులో ఒకటి 177 హార్స్ పవర్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్, మరొకటి 141 హార్స్ పవర్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్. రానున్న రోజుల్లో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన బేస్ వేరియంట్‌ను కూడా విడుదల చేసే ఆస్కారం ఉంది.

ట్రాన్సిమిషన్
పెట్రోల్ వెర్షన్ కేవలం 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇకపోతే డీజిల్ వెర్షన్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వెర్షన్‌లో ప్రస్తుతానికి మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వెర్షన్ అందుబాటులో లేదు.

ఔరంగాబాద్ ప్లాంటులో ఉత్పత్తి షూరూ
ఔరంగాబాద్ ప్లాంటులో స్కొడా ఆక్టావియా ఉత్పత్తి ప్రారంభమైందని, త్వరలోనే దీనిని మార్కెట్లో విడుదల చేస్తామని, ఈ కారు ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ అధికారులు వెల్లడించారు. ఇదే ప్లాంటులో సూపర్బ్, లారా, యెటి, లారా మోడళ్లు ఉత్పత్తి అవుతున్నాయి.


Click it and Unblock the Notifications








