2013 జెనీవా మోటార్ షో: స్కొడా ఆక్టావియా విడుదల
కాలం చెల్లిపోయిన ఆక్టావియా స్కొడా తిరిగి ప్రాణం పోసుకుంది. గడచిన సంవత్సరంలో, సరికొత్త ఆక్టావియా ఫోటోలను విడుదల చేసిన చేసిన స్కొడా ఆటో ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇందుకు జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోను కంపెనీ వేదికగా ఎంచుకుంది. అత్యుత్తమ ఇంటీరియర్స్, ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఫీచర్స్, అధునాత టెక్నాలజీ మరియు ఆకట్టుకునే మైలేజ్ వంటి సదుపాయాలతో స్కొడా తమ సరికొత్త 2013 ఆక్టావియా రూపొందించింది.
సరికొత్త 2013 స్కొడా ఆక్టావియా ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలెస్లావ్ ప్లాంటులోని కొత్త స్కొడా ఆక్టావియా ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడి నుండి పలు గ్లోబల్ మార్కెట్లకు ఈ కారు ఎగుమతి కానుంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు నుంచి పాపులర్ అయిన కొత్త ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కొత్త ఆక్టావియాను తయారు చేశారు. పాత వెర్షన్ ఆక్టావియాతో పోల్చుకుంటే, 2013 స్కొడా ఆక్టావియా అన్ని విధాలుగా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉండనుంది.

2013 జెనీవా మోటార్ షోలో సరికొత్త స్కొడా ఆక్టావియా

గ్లోబల్ మార్కెట్లలో 2013 స్కొడా ఆక్టావియా నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఎంట్రీ-లెవల్ స్కొడా ఆక్టావియాలో 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 138 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1.4 లీటర్ ఇంజన్ అలాగే 177 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. కొత్త అక్టావియా వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదలైన కొద్ది నెలల తర్వాత ఇది 2.0 లీటర్ టర్బో ఇంజన్‌తో (ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించే ఇంజన్) కూడా ఇది లభించే ఆస్కారం ఉంది.
డీజిల్ వెర్షన్ స్కొడా ఆక్టావియా విషయానికి వస్తే, 103 బిహెచ్‌పి 1.6 లీటర్ ఇంజన్, 108 బిహెచ్‌పి గ్రీన్‌లైన్ వెర్షన్, 147 బిహెచ్‌పి 1.6 లీటర్ మరియు 181 బిహెచ్‌పి 2.0 లీటర్ ఇంజన్లతో ఇది లభ్యం కానుంది. కొత్త ఆక్టావియా సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఫైవ్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లతో లభ్యం కానుంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Click it and Unblock the Notifications