మరిన్ని అదనపు ఫీచర్లతో వచ్చిన 2013 టాటా నానో

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'లో ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా నానోతో పోల్చుకుంటే డిజైన్, ఫీచర్ల పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా కంపెనీ ఈ సరికొత్త 2013 టాటా నానో‌ను తీర్చిదిద్దింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఈ కారులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను కంపెనీ అభివృద్ధి చేసింది.

ఈ కొత్త 2013 టాటా నానో కారులో రిమోట్ కీలెస్ ఎంట్రీ, డ్యాష్‌బోర్డుపై ఏర్పాటు చేసిన రెండు గ్లౌ బాక్సులు, 12 వోల్ట్ పవర్‌ సాకెట్‌తో కూడిన రీస్టయిల్డ్ సెంటర్ కన్సోల్, రియర్ పార్సిల్ షెల్ఫ్, నాలుగు స్పీకర్లు, బ్లూటూత్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన ఆంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఇంటీరియర్ ఫీచర్లను జోడించారు.

అలాగే, కొత్త ఎక్స్టీరియర్ కలర్స్, ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ స్ట్రిప్స్‌తో మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా డిజైన్ చేశారు. వెనుక వైపు ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను బంపర్‌కు పెద్ద ఎయిర్ వెంట్స్‌ను జోడించారు. సులువుగా స్టీరింగ్‌ను ఆపరేట్ చేసేలా స్టీరింగ్‌ను, సస్పెన్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మూడు కొత్త ఎక్స్టీరియర్ కలర్స్ (డాజల్ బ్లూ, రాయల్ గోల్డ్, కార్న్‌ఫ్లవర్ బ్లూ)ను జోడించారు.

కాగా, కొత్త నానో బేసిక్ డిజైన్, ఇంజన్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. జులై నాటికి ఈ 2013 టాటా నానో డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది. మరి ఈ కొత్త నానోపై ఓ కన్నేద్దాం రండి..!

2013 టాటా నానో
2013 టాటా నానో
2013 టాటా నానో
2013 టాటా నానో

More from DriveSpark

Article Published On: Thursday, June 20, 2013, 9:57 [IST]
English summary
Tata Motors announced the introduction of an array of new features available on the Tata Nano, including remote keyless entry, twin glove boxes, and a four-speaker AmphiStream™ music system with Bluetooth™, USB and auxiliary connectivity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+