ఫెరారీ నుంచి మరిన్ని హైబ్రిడ్ కార్స్, కానీ నో ఎలక్ట్రిక్ కార్స్

By Ravi

ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ ఫెరారీ, ఇప్పుడు హైబ్రిడ్ కార్లపై దృష్టి సారించింది. ఇటీవల జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో ఫెరారీ ఆవిష్కరించిన 'ఫెరారీ లాఫెరారీ' (Ferrari LaFerrari) హైబ్రిడ్ కారుకు మంచి స్పందన లభించడంతో, ఇకపై భవిష్యత్తులో మరిన్ని హైబ్రిడ్ హైపర్ కార్లను ఉత్పత్తి చేస్తామని ఫెరారీ పేర్కొంది.

అయితే, పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో (బ్యాటరీతో) నడిచే కార్లను మాత్రం ఉత్పత్తి చేయబోమని ఫెరారీ స్పష్టం చేసింది. (పెట్రోల్/డీజిల్ ఇంజన్ ప్లస్ ఎలక్ట్రిక్ మోటార్లతో నడిచే కార్లను హైబ్రిడ్ కార్లు అంటారు). సూపర్ కార్ మార్కెట్లో ఇప్పటికే హైబ్రిడ్ హైపర్ కార్ల పర్వం మొదలైంది. మెక్‌లారెన్ ఆవిష్కరించిన పి1 హైబ్రిడ్ హైపర్ కారు, సెప్టెంబర్ పోర్షే నుంచి రానున్న 918 స్పైడర్ కార్లు ఈ సెగ్మెంట్లో ప్రధానంగా చెప్పుకోదగినవి.

LaFerrari

ఫెరారీ బాస్ లుకా కార్డెరో డి మోటోజెమోలో ఇటీవల బ్లూంబర్గ్‌రు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, మారనెల్లో మోంటెజెమోలో నుంచి మరిన్ని హైపర్ కార్లను ఆశించినవచ్చా అన్ని ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు. అయితే అంతకు మించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ కార్లపై నాకు పెద్దగా విశ్వాసం లేదు కానీ హైబ్రిడ్ కార్లపై నాకు గట్టి నమ్మకం ఉందని ఆయన చెప్పారు.

వాస్తవానికి ఎలక్ట్రిక్ సూపర్ కార్లు పెట్రోల్ ఇంజన్‌తో కూడిన సూపర్ కార్లను నడిపే అనుభూతిని ఇవ్వవు. అందుకే, మెక్‌లారెన్ పి1 మాదిరిగా ఫెరారీ లాఫెరారీ హైబ్రిడ్ పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై పనిచేయదు (ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజన్ రెండూ ఏక కాలంలో పనిచేస్తాయి). లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
When asked if more hybrid cars are to be expected from Maranello Montezemolo said, "..the answer is yes, without exceeding." By that he meant, "I don't believe in the electric cars, but I strongly believe in hybrids," Luca Cordero di Montezemolo told the publication.
Story first published: Friday, August 23, 2013, 9:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X