సైలెంట్‌గా ఫోర్స్ వన్ బేస్, టాప్ ఎండ్ వేరియంట్ల విడుదల

By Ravi

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ గుర్తుందా? ప్రముఖ వాణిజ్య వానాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ గడచిన ఆగస్ట్ 2011లో విడుదల చేసిన తమ తొలి ఎస్‌యూవీ 'ఫోర్స్ వన్'ను భారత మార్కెట్లో అంతంత మాత్రంగానే అమ్ముడవుతోంది. ఈ బ్రాండ్‌కు ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ అమ్మకాలు మాత్రం ఆశాజనకంగా లేవు.

ఇందుకు ప్రధాన కారణం ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో తక్కువ ధర కలిగిన వేరియంట్ లేకపోవటం, అలాగే ఆఫ్ రోడింగ్ కోసం ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో లేకపోవటం. ఈ నేపథ్యంలో, ఫోర్స్ మోటార్స్ సైలెంట్‌గా ఈ రెండు వేరియంట్లను ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఫోర్స్ మోటార్స్ విడుదల చేసిన లోకాస్ట్ వేరియంట్‌ను ఎగ్జిక్యూటివ్ (ఈఎక్స్) అని పిలుస్తారు. దీని ధర రూ.8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. సుపీరియర్ (ఎస్ఎక్స్), లగ్జరీ (ఎల్ఎక్స్) వేరియంట్లలో ఉండే అనేక కంఫర్ట్ ఫీచర్లను తొలగించి ఈ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను రూపొందించారు.

Force One SUV

ఈ కొత్త చవక వేరియంట్‌లో డేటైమ్ రన్నింగ్ లైట్స్, అల్లాయ్ వీల్స్, సైడ్ మిర్రర్లపై ఇండికేటర్స్, లెథర్ సీట్స్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, ఆల్ టెర్రైన్ టైర్లు మరియు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు లేవు. ఇందులో కనీసం రిమోట్ లాకింగ్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, రియర్ వైపర్ వంటి ఫీచర్లు కూడా లేవు. ధరను తక్కువగా ఉంచేందుకే ఈ ఫీచర్లన్నింటినీ తొలగించారు.

ఈ బేస్ వేరియంట్ (ఎక్స్)లో ఇంజన్ పరంగా కూడా మార్పులు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ నుంచి గ్రహించిన 2.2 లీటర్ ఇంజన్ స్థానంలో, కొత్త ఫోర్స్ గుర్ఖాలో ఉపయోగించిన 2.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది బిఎస్-3 ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 80 పిఎస్‌ల శక్తిని, 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ఫోర్స్ మోటార్స్ తమ ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో ఓ లోకాస్ట్ వేరియంట్‌ను విడుదల చేయటంతో పాటుగా ఎస్ఎక్స్, ఎల్ఎక్స్ వేరియంట్లలో కొన్ని మార్పులు చేసింది. ఎస్ఎక్స్ వేరియంట్ ఇప్పుడు ఈబిడి, ఏబిఎస్ ఆప్షన్‌తో లభ్యమవుతుండగా, ఎల్ఎక్స్ వేరియంట్ షిఫ్ట్ ఆన్ ది ఫ్లై ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో ఈ మోడల్ ధరలు ఇలా ఉన్నాయి.

  • ఫోర్స్ వన్ ఈఎక్స్ (7-సీటర్) - రూ.8,99,000
  • ఫోర్స్ వన్ ఎస్ఎక్స్ (7-సీటర్) - రూ.11,91,291
  • ఫోర్స్ వన్ ఎస్ఎక్స్ (6-సీటర్) - రూ.11,99,002
  • ఫోర్స్ వన్ ఎస్ఎక్స్ ఏబిఎస్ (6-సీటర్) - రూ.12,27,821
  • ఫోర్స్ వన్ ఎస్ఎక్స్ ఏబిఎస్ (7-సీటర్) - రూ.12,20,188

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

Most Read Articles

English summary
Force Motors has silently launched new variants of the Force One SUV. The company has added a new base variant and a 4x4 version with ABS and EBD. The low-cost variant is called the Executive (EX) and is priced at Rs 8.99 lakh (ex-showroom, Hyderabad).
Story first published: Wednesday, July 24, 2013, 17:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X