ఆటోమేటిక్‌గా గాలిని నింపుకునే టైర్లు వస్తున్నాయ్..!

By Ravi

Tire
వాహనం ముందుకు నడవాలంటే టైర్లలో సరైన వాయి పీడనం (ఎయిర్ ప్రెజర్) ఉండటం ఎంతో అవసరం. టైర్లలో గాలి తగ్గితే, ఇంజన్‌ రన్నింగ్ భారమై మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, తక్కువ గాలి ఉండే టైర్లను నడపటం వలన టైర్లు త్వరగా అరిగిపోయి వాటి జీవిత కాలం కూడా తగ్గుతుంది. అందుకే టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, భవిష్యత్తులో ఈ శ్రమ ఉండబోదు. ఎందుకంటే, మనం టైర్లలో కృత్రిమంగా గాలి నింపాల్సిన అవసరం లేని టైర్లు త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయి.

అమెరికాకు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ 'గుడ్ఇయర్' ఓ అద్భుతమైన టైర్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. 'ఎయిర్ మెయింటినెన్స్ టెక్నాలజీ'గా పిలిచే ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో టైర్లలో గాలిని ఆటోమేటిక్‌గా నింపుకునే సౌకర్యం ఉంటుంది. ఇందులో ఎలాంటి ఎలక్ట్రానిక్ కంట్రోల్స్, ఎయిర్ పంప్స్ సాయం లేకుండానే టైర్లలో ఆటోమేటిక్‌గా గాలి ఉత్పత్తి అయ్యే ఏర్పాటు ఉంటుంది. టైర్లలో సరైన పీడనాన్ని ఉంచడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేసుకోవటమే కాకుండా, రబ్బర్ అరుగుదలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో గుడ్ఇయర్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

ఈ టెక్నాలజీలో భాగంగా టైర్లలో ఓ క్లెవర్ పంపింగ్ డివైజ్‌ను అమర్చడం జరుతుగుంది. టైరు తిరుగుతున్నప్పుడు, వాహన భారాన్ని బట్టి, టైర్లలో గాలి తగ్గినట్లు అనిపిస్తే, ఈ పంప్ యాక్టివేట్ అయి, మనషులు పంపుతో గాలి కొట్టినట్లుగానే ట్యూబులోకి గాలిని పంపించి టైర్లలో ఎప్పటికప్పుడు సరైన పీడనం ఉండేలా చేస్తుంది. ఇదంతా కూడా డ్రైవర్ సాయం లేకుండా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఇదిలా ఉండగా.. జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జ్‌స్టోన్ అసలే గాలే అవసరం లేని "నాన్-న్యుమాటిక్ టైర్" కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

సాధారణ టైర్ల మాదిరిగా ఈ టైర్లకు గాలి (ఎయిర్) అవసరం ఉండదు. ఈ టైర్లు అస్సలు పంక్చర్లు కావు, పగిలిపోవు, అధిక వేగంతో వెళ్తున్నప్పటికీ ఇవి బరస్ట్ కాకుండా ఉండి ప్రమాదాల నుండి రక్షిస్తాయి. ఈ టైర్లు సురక్షితమైనవే కాకుండా ప్రకృతి సాన్నిహిత్యమైనవి కూడా. ఈ టైర్లలో ఎయిర్ కంపార్ట్‌మెంట్‌కు బదులు స్పోక్స్ (థర్మోప్లాస్టిక్ రిబ్స్) వంటి నిర్మాణం ఉంటుంది. ఈ టైర్లను 100 శాతం రీసైకిల్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
American tyre manufacturer, Goodyear has developed a self-inflating tire technology called as Air Maintenance Technology. This technology intended to keep commercial truck tires at the proper pressure, saving fuel and reducing tread wear by automatically keeps tires inflated without the need for electronic controls or external pumps.
Story first published: Monday, January 7, 2013, 15:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X