2014 BMW 4 సిరీస్ కూపే ఆవిష్కరణ: ఫొటోలు, వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న 3-సిరీస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఓ సరికొత్త 2014 4-సిరీస్‌ను కంపెనీ ఆవిష్కరించింది. అమెరికన్ మార్కెట్ల కోసం డిజైన్ చేసిన ఈ అధునాతన బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ లగ్జరీ కూపే, ఇదివరకటి 3-సిరీస్ కన్నా అనేక రెట్లుగా మెరుగ్గా ఉండనుంది. సరికొత్త తరం బిఎమ్‌డబ్ల్యూ డిజైన్ థీమ్‌తో అభివృద్ధి చేయబడిన కొత్త 4-సిరీస్ మునపటి 3-సిరీస్ కన్నా సన్నగా ఉంటుంది.
2014 బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ కూపే 428ఐ, 435ఐ మోడళ్లలో ఆఫర్ చేయనున్నారు. ఇది 2.0 లీటర్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ మరియు 3.0 లీటర్ ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ రెండు మోడళ్లలో కూడా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉండనుంది. 428ఐ ఎక్స్‌డ్రైవ్ వేరియంట్ మాత్రమే 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుండగా, మిగిలినవి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతాయి.
ఇందులో ఉపయోగించిన 2.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 240 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 428ఐ వేరియంట్ కేవలం 6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అలాగే 3.0 లీటర్ వేరియంట్ గరిష్టంగా 300 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.
బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ కూపే, 3-సిరీస్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ పొడవు (182.6 ఇంచ్), 2 ఇంచ్‌లు ఎక్కువ వీల్‌బేస్ (110.0 ఇంచ్) మరియు 1.7 ఇంచ్‌ల వెడల్పును (71.9 ఇంచ్) కలిగి ఉంటుంది. అయితే, ఎత్తు మాత్రం 0.6 ఇంచ్‌లు తక్కువగా (53.6) ఉంటుంది. ఇది స్పోర్ట్, లగ్జరీ ఎమ్ స్పోర్ట్ వెర్షన్లలో లభ్యమవుతుంది. అమెరికా మార్కెట్లో ఈ మోడల్ ధరలు ఇలా ఉన్నాయి:
బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ 428ఐ కూపే: $41,425
బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ 428ఐ ఎక్స్‌డ్రైవ్ : $46,925
బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ 435ఐ కూపే: $43,425
బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ 435ఐ ఎక్స్‌డ్రైవ్ : $48,925




























Click it and Unblock the Notifications








