హైదరాబాద్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 విడుదల
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, గడచిన నెలాఖరులో దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త అప్‌డేటెడ్ 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీని తాజాగా హైదరాబాద్ మార్కెట్లో కూడా కంపెనీ విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విడుదల చేసిన ఈ కొత్త కొత్త ఎక్స్5 ఎస్‌యూవీ మూడవ తరాని (థర్డ్ జనరేషన్)కి చెందినది.
కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5లో 3.0 లీటర్ (2993సీసీ), ఇన్-లైన్ 6-సిలిండల్, ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 258 హెచ్‌పిల శక్తిని, 1500-3000 ఆర్‌ప్ఎమ్ వద్ద 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

పెద్ద గ్రిల్, పెద్ద హెడ్‌లైట్స్, ఇంప్రూవ్డ్ డ్యాష్‌బోర్డ్, ఉడెన్ ఫినిషింగ్, 10.5 ఇంచ్ ఐడ్రైవ్ స్క్రీన్, రివర్సింగ్ కెమెరా, హైక్వాలిటీ సీట్స్ వంటి పలు అప్‌గ్రేడ్స్ ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5లో ప్రధానంగా చెప్పుకోదగినవి. ఇది మునుపటి వెర్షన్ కన్నా మరింత పెద్దదిగా, బోల్డ్‌గా మరియు స్పోర్టీయర్‌గా అనిపిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తొలిసారిగా తమ సరికొత్త ఎక్స్5 మోడల్‌ను భారత్‌కు పరిచయం చేసింది.
ఇంకా ఇందులో పానోరామిక్ సన్‌రూఫ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, 3 కలర్లలో యాంబీంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో పాటుగా కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సిబిసి), డైనమిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (డిఎస్‌సి), రన్ ఫ్లాట్ టైర్స్, ఫ్రంట్ అండ్ రియర్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ అండ్ రియర్ హెడ్ ఎయిర్‌బ్యాగ్స్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. రాష్ట్ర విపణిలో దీని ధర రూ.71 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








