రూ.4.99 లక్షలకే 2014 ఫోర్డ్ క్లాసిక్ సెడాన్

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ 'ఫోర్డ్ క్లాసిక్' (పాత వెర్షన్ ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్)ను కంపెనీ ఇప్పుడు కేవలం రూ.4.99 లక్షల ప్రారంభ ధరకే ఆఫర్ చేస్తోంది. జనవరి 22, 2014వ తేది నుంచి మొత్తం ఫోర్డ్ క్లాసిక్ రేంజ్ కార్ల ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.7.59 లక్షల రేంజ్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

కార్యనిర్వాహక సామర్థ్యాల ద్వారా తమ ఉత్పత్తుల విలువ స్థాయిని మెరుగుపరచి, వినియోగదారులకు సరమైన ధరకే మెరుగైన ఉత్పత్తులను విక్రయించేలా కొత్త ఫోర్డ్ క్లాసిక్ ధరను నిర్ణయించామని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. కొత్త 2014 ఫోర్డ్ క్లాసిక్ ధరలో తప్ప డిజైన్‌లో కానీ, ఫీచర్లలో కానీ లేదా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. తాజాగా ఫోర్డ్ క్లాసిక్ ధరలను సవరించడంతో, మునుపటి ధరలతో పోల్చుకుంటే ప్రస్తుత ధరలు వేరియంట్‌ను బట్టి దీని ధరలు సుమారు రూ.70,000 నుంచి రూ.1 లక్ష మేర తగ్గాయి.


ఫోర్డ్ ఇండియా గడచిన 2012 మధ్య భాగంలో పాత ఫియస్టా సెడాన్‌ను క్లాసిక్‌గా పేరు మార్చి, ధరను తగ్గించి విడుదల చేసింది. డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ టైటానియం వేరియంట్ గరిష్టంగా లీటర్ డీజిల్‌కు 32.38 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) కంపెనీ పేర్కొంది. డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్‌లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ లీటరు పెట్రోల్‌కు 21.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో 1.6 లీటర్ డ్యూరాటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 101 పిఎస్‌ల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్డ్ క్లాసిక్‌ టాప్-ఎండ్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్టీరియో సిస్టమ్, వేగాన్ని బట్టి సౌండ్ తగ్గిపోయేలా ఏర్పాటు చేసిన స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్, డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌‌గా లాక్ అయ్యే డ్రైవ్-అవే లాక్స్, బీజ్ ఇంటిరీయర్ ట్రిమ్, సరికొత్త అల్లాయ్ వీల్ డిజైన్, బాడీ కలర్‌లో ఉండే సైడ్ మిర్రర్స్, బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ ఫీచర్లతో లభిస్తుంది.

ఫోర్డ్ క్లాసిక్ సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (పాప్రికా రెడ్, పాంథర్ బ్లాక్, డైమండ్ వైట్, చిల్ మెటాలిక్, మూన్ డస్ట్ సిల్వర్, సీ గ్రే), ఇది రెండేళ్లు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

Ford Classic Price Cut

కొత్త ఫోర్డ్ క్లాసిక్ వేరియంట్లు, వాటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

* ఫోర్డ్ క్లాసిక్ 1.6 ఎల్ఎక్స్ఐ డ్యూరాటెక్ పెట్రోల్: రూ. 4.99 లక్షలు
* ఫోర్డ్ క్లాసిక్ 1.6 సిఎల్ఎక్స్ఐ డ్యూరాటెక్ పెట్రోల్: రూ. 5.69 లక్షలు
* ఫోర్డ్ క్లాసిక్ 1.6 టైటానియం డ్యూరాటెక్ పెట్రోల్: రూ. 6.49 లక్షలు
* ఫోర్డ్ క్లాసిక్ 1.4 ఎల్ఎక్స్ఐ టిడిసిఐ డీజిల్: రూ. 6.39 లక్షలు
* ఫోర్డ్ క్లాసిక్ 1.4 సిఎల్ఎక్స్ఐ టిడిసిఐ డీజిల్: రూ. 6.87 లక్షలు
* ఫోర్డ్ క్లాసిక్ 1.4 టైటానియం టిడిసిఐ డీజిల్: రూ. 7.59 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, January 22, 2014, 15:38 [IST]
English summary
Ford India today announced the launch of its 2014 Ford Classic sedan at new, attractive price points starting at Rs. 4.99 lakh at showrooms in Delhi, with an aim to provide an enhanced value proposition to discerning customers. Starting January 22, the entire Ford Classic range will be available between Rs. 4.99 lakh and Rs. 7.59 lakh (ex-showroom, Delhi). 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+