డీజిల్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్న 2014 ఫోర్డ్ ఫియస్టా

By Ravi

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఫోర్డ్ ఇండియా ప్రదర్శించిన సరికొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ను కంపెనీ మరికొద్ది రోజుల్లోనే కంపెనీ దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే ఫోర్డ్ ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌‌కు సంబంధించి కొన్ని వివరాలను కూడా విడుదల చేసింది.

అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్ కేవలం డీజిల్ వెర్షన్‌లో మాత్రమే విడుదల కానున్నట్లు సమాచారం. ఈ కొత్త డీజిల్ వెర్షన్‍‌లో కూడా మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుత ఫియస్టాలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఈ కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోను ఉపయోగించనున్నారు. ప్రస్తుతానికి పెట్రోల్ వెర్షన్ గురించా ఎలాంటి సమాచారం లేదు. అయితే, భవిష్యత్తులో 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్‌ను ఇందులో పరిచయం చేయవచ్చని తెలుస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

2014 ఫోర్డ్ ఫియస్టా

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా సెడాన్‌లో ప్రధానంగా ఆస్టన్ మార్టిన్ లాంటి ఫ్రంట్ గ్రిల్ (ఇదివరకటి ఫియస్టాలోని బ్లాక్ ప్లాస్టిక్ గ్రిల్ స్థానంలో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన గ్రిల్) ఈ కారుకు మరింత ప్రీమియం లుక్‌నిస్తుంది.

2014 ఫోర్డ్ ఫియస్టా

ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు హెడ్‌‌ల్యాంప్స్ కూడా ఇందులో కొత్తవిగా అనిపిస్తాయి.

2014 ఫోర్డ్ ఫియస్టా

హెడ్‍‌లైట్స్ గురించి ప్రస్తావిస్తే.. ఇందులోని కొత్త యూనిట్స్ కొత్త ఫియస్టాలో బెస్ట్ ఫీచర్స్‌గా చెప్పుకోవచ్చు. స్వెప్ట్ బ్యాక్ షేపులో ఉండే హెడ్‌ల్యాంప్స్, చక్కగా ఉండే దీని డిజైన్ తొలిచూపులోనే ఆకట్టుకుంటుంది.

2014 ఫోర్డ్ ఫియస్టా

వెనుక వైపు గమనిస్తే, రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, డిఫ్యూజర్‌తో కూడిన రియర్ బంపర్‌లు కొత్తవిగా అనిపిస్తాయి. ఇవి కారుకు మరింత స్పోర్టీ లుక్‌నిస్తాయి.

2014 ఫోర్డ్ ఫియస్టా

కొత్త ఫోర్డ్ ఫియస్టా బాడీని బోరాన్ స్టీల్ అల్లాయ్‌తో తయారు చేశారు. ఇది రెగ్యులర్ స్టీల్ కన్నా నాలుగు రెట్లు ధృడంగా ఉంటుందని ఫోర్డ్ పేర్కొంది.

2014 ఫోర్డ్ ఫియస్టా

ఇంకా ఇందులో కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను కూడా గమనించవచ్చు. బహుశా టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే ఈ స్టయిలిష్ అల్లాయ్ వీల్స్ లభ్యమయ్యే అవకాశం ఉంది.

2014 ఫోర్డ్ ఫియస్టా

కొత్త 2014 ఫియస్టా ఫోర్డ్ సింక్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. ఈ సిస్టమ్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ ఫోన్ కాల్స్, హ్యాండ్సీ-ఫ్రీ మ్యూజిక్ ప్లేబ్యాక్, టెక్స్ట్ మెసేజ్ రీడ్-అవుట్, యాప్‌లింక్, వాయిస్ యాక్టివేటెడ్ ఎమర్జెన్సీ అసిస్ట్ వంటి పలు ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్‌ను ఇప్పటికే ఈకోస్పోర్ట్‌లో ఆఫర్ చేస్తున్నారు.

2014 ఫోర్డ్ ఫియస్టా

ఇందులో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌లైట్స్ వంటి కొన్ని స్మార్ట్ ఫీచర్లు టాప్ ఎండ్ వేరియంట్ ఫియస్టాలో లభ్యం కానున్నాయి.

2014 ఫోర్డ్ ఫియస్టా

కొత్త 2014 ఫోర్డ్ ఫియస్టా డీజిల్ ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 90 పిఎస్, 1.5 లీటర్, టిడిసిఐ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 2, 2014, 14:28 [IST]
English summary
The 2014 Ford Fiesta facelift will be launched only in the diesel variant. The new Fiesta has no changes mechanically and it is the same diesel engine which it was powered by before.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+