భారత్‌లో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ కార్ 'హోండా సిటీ'
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇక హోండా కార్స్ ఇండియాకు తిరుగు ఉండబోదని తెలుస్తోంది. ఇప్పటికే హోండా అమేజ్ డీజిల్ కారు విడదలతో దేశీయ విపణిలో ఎనలేని సక్సెస్‌ను సాధించి సంబరంలో ఉన్న హోండా ఇప్పుడు తాజాగా తమ పాపులర్ సి-సెగ్మెంట్ సెడాన్ 'హోండా సిటీ'లో డీజిల్ వెర్షన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ మార్కెట్లో వాణిజ్య పరంగా లభ్యం కానుంది.
ఈ నేపథ్యంలో, హోండా తాజాగా ఆవిష్కరించిన 2014 హోండా సిటీ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇందులో అన్నింటి కన్నా ప్రధానమైనది కొత్త సిటీ మైలేజ్. డీజిల్ వెర్షన్ హోండా సిటీ లీటరుకు 26 కిలోమీటర్ల (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది హోండా అమేజ్ మైలేజ్ (25 కెఎమ్‌పిఎల్) కన్నా అధికం.

హోండా అమేజ్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్‌నే కొత్త 2014 హోండా సిటీ కారులోను ఉపయోగించారు. అయితే, కొత్త సిటీ, అమేజ్ కారు కన్నా ఎక్కువ మైలేజీని ఇవ్వటానికి రెండు కారణాలున్నాయి. అందులో మొదటిది, రీఫైన్డ్ డీజిల్ ఇంజన్. హోండా ఇంజనీర్లు ఈ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను సిటీ కోసం రీట్యూన్ చేశారు. ఇకపోతే రెండవ కారణం, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్. హోండా అమేజ్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

అలాగని, పెట్రోల్ వెర్షన్ 2014 హోండా సిటీ మైలేజీ విషయంలో నిరుత్సాహపరచదు. ఇది కూడా సెగ్మెంట్లో కెల్లా బెస్ట్ మైలేజీని ఆఫర్ చేస్తుంది. హోండా పేర్కొన్న సమాచారం 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన 2014 హోండా సిటీ లీటరుకు 17.8 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీని ఆఫర్ చేస్తుంది. అదే సివిటి ట్రాన్సిమిషన్ కలిగిన ఆటోమేటిక్ వెర్షన్ హోండా సిటీ లీటరుకు 17.9 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజీని ఆఫర్ చేస్తుంది.
కొత్త 2014 హోండా సిటీ సెడాన్‌కు సంబంధించిన పూర్తి రివ్యూ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








