హోండా సిటీ కావాలా? నాలుగు నెలలు ఆగండి..!

హోండా కార్స్ ఇండియా ఇటీవలే విడుదల చేసిన సరికొత్త 2014 హోండా సిటీ సెడాన్ ఇప్పుడు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం అవుతుండటంతో, మార్కెట్లో ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మోడల్‌కు ఉత్పత్తికి మించి డిమాండ్ వస్తుండటంతో, దీని వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలల వరకు ఉంటోంది.

ఇది కూడా చదవండి: 2014 హోండా సిటీ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్ - రివ్యూ

గడచిన జనవరి నెలలో హోండా తమ సరికొత్త సిటీ సెడాన్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. ఇప్పటి వరకు కంపెనీ సుమారు 30,959 సిటీ సెడాన్లను డెలివరీ చేసింది. హోండా సిటీ మొత్తం సేల్స్‌లో టాప్ ఎండ్ వేరియంట్ అమ్మకాలు దాదాపు 50 శాతానికి పైగా ఉంటే, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన వేరియంట్ అమ్మకాలు సుమారు 30 శాతానికి పైగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.


ప్రస్తుతం హోండా అందిస్తున్న 4వ తరానికి చెందిన (ఫోర్త్ జనరేషన్) హోండా సిటీ, ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతుంది. కొత్త 2014 హోండా సిటీలో ఇంజన్లను రీఫైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ 119 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 17.8 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 17.9 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

డీజిల్ వెర్షన్ హోండా సిటీలో అధునాతన 1.5 లీటర్ ఐ-డిటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 26 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. హోండా సిటీ పెట్రోల్, డీజిల్ వేరియంట్లు, ధరల వివరాలు వెల్లడి కొత్త 2014 హోండా సిటీ మొత్తం 12 వేరియంట్లలో (7 పెట్రోల్ వేరియంట్లు, 5 డీజిల్ వేరియంట్లు) లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 13, 2014, 10:26 [IST]
English summary
Honda recently launched the latest version of their 2014 Honda City. The Japanese automobile giant now offers the vehicle in a diesel variant too. This has catapulted the sales as well as bookings of the latest model.The problem that the Japanese manufacturer now faces is a shortage of vehicles that the consumer demands. There is a short waiting period of four months from the day you book your vehicle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+