2014 హ్యుందాయ్ ఎలాంట్రా/అవాంటే ఫేస్‌లిఫ్ట్ విడుదల
కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రాలో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ మార్కెట్లో ఆవిష్కరించింది. మునుపటి వెర్షన్ ఎలాంట్రాతో పోల్చుకుంటే మరింత ప్రీమియం లుక్, లగ్జరీ ఫీల్‌ను ఇచ్చేలా కొత్త ఎలాంట్రా కారును డిజైన్ చేశారు. ఈ నెలాఖరు నాటికి కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడుపోనుంది. త్వరలోనే ఇది భారత మార్కెట్లో కూడా లభ్యం కానుంది.
2014 హ్యుందాయ్ ఎలాంట్రా అఫీషియల్ ఫేస్‌లిఫ్ట్ ఫొటోలను కంపెనీ విడుదల చేసింది. హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లూయిడిక్ వెర్నా ప్రీమియం సెడాన్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. ఈ నేపథ్యంలో కొత్త ఎలాంట్రా ద్వారా ఈ ఖాళీని భర్తీ చేసుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది.
ఎలాంట్రాను 'అవాంటే' పేరుతో హ్యుందాయ్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తుంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎలాంట్రా ఫొటోలతో పాటుగా, ఈ కారుకు సంబంధించిన కొంత సమాచారాన్ని కంపెనీ విడుదల చేసింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

ఫేస్‌లిఫ్ట్ ఎలాంట్రా పొడవును స్వల్పంగా పెంచారు. ప్రస్తుతం దీని మొత్తం పొడవు 4550 మి.మీ. ఫ్రంట్ బంపర్ వద్ద 5 మి.మీ., రియర్ బంపర్ వద్ద 15 మి.మీ. పొడవును పెంచారు.

స్వల్పంగా రీడిజైన్ చేయబడిన బంపర్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, 17 ఇంచ్ టూ టోన్ అల్లాయ్ వీల్స్ ఈ ఫేస్‌లిఫ్ట్ 2014 హ్యుందాయ్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు.

సెంటర్ ఎయిర్-వెంట్‌ను డ్యాష్‌బోర్డుపై రీపొజిషన్ చేశారు, అలాగే ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఎత్తును కొద్దిగా పెంచారు. వెనుక సీట్లకు చక్కగా వెంటిలేషన్ వచ్చే ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, 3.5 ఇంచ్ ఓఎల్ఈడి డిస్‌ప్లే, స్మార్ట్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్ ఇందులో ప్రధాన మార్పులు.

ఈ కొరియన్ వెర్షన్ అవాంటే (2014 ఎలాంట్రా)లో సరికొత్త డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో అమర్చనున్న 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 126 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2014 హ్యుందాయ్ ఎలాంట్రాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న 2013 హ్యుందాయ్ ఎలాంట్రా.

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో లభ్యమవుతున్న 2013 హ్యుందాయ్ అవాంటే ప్రీమియం సెడాన్.


Click it and Unblock the Notifications








