2014 హ్యుందాయ్ ఐ20లో డబ్ల్యూఆర్‌సి రేస్ కార్ ఇన్‌పుట్స్

By Ravi

హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి (Hyundai i20 WRC) గుర్తుందా..? కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ తొలిసారిగా 2012 ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించిన రేస్ వెర్షన్ ఐ20 ఇది. అయితే, మాకేంటి అంటారా..? అక్కడికే వస్తున్నా..!

హ్యుందాయ్ అందిస్తున్న ప్రస్తుత ఐ20 కారు త్వరలోనే తన రూపు రేఖలు మార్చుకోనుంది. అంటే, ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి రానుందన్నమాట. హ్యుందాయ్ నుంచి రానున్న 2014 ఫేస్‌లిఫ్ట్ ఐ20 కారును, రేస్ వెర్షన్ ఐ20 డబ్ల్యూఆర్‌సి నుంచి స్ఫూర్తి పొంది రూపొందించనున్నట్లు సమాచారం. ఇందులోని అనేక డిజైన్ ఫీచర్లను కొత్త ఐ20లో జోడించే ఆస్కారం ఉంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త హ్యుందాయ్ ఐ20 కారును కంపెనీ ఇప్పటికే యూరప్ మార్కెట్లలో టెస్టింగ్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే, ఇది వచ్చే ప్రథమార్థం నాటికి గ్లోబల్ మార్కెట్లలోను, ద్వితీయార్థం చివరి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సికి సంబంధించిన మరింత సమాచారం కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

ఈ ఏడాది మార్చ్ నెలలో జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో హ్యుందాయ్ తమ కొత్త ఐ20 డబ్ల్యూఆర్‌సి (వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్)ని ప్రదర్శనకు ఉంచింది.

హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

వచ్చే ఏడాది (2014) జరగనున్న వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ పాల్గొనేందుకు గాను హ్యుందాయ్ తమ రెగ్యులర్ ఐ20 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ 'హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి' (వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్) కారును అభివృద్ధి చేసింది.

హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

రేస్ ట్రాక్‌కు సరిపోయేలా ఈ కారుకు కాస్మోటిక్, సస్పెన్షన్, ఏరోడైనమిక్స్ వంటి మార్పులు చేయటమే కాకుండా ఇంజన్ పరంగా కూడా మార్పులు చేయనున్నారు. హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి అభివృద్ధి తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

ఈ కారుకు సంబంధించిన సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది నాటికి ఇది పూర్తిస్థాయిలో సిద్ధం కావచ్చని తెలుస్తోంది. ఈ కారులో 300 హెచ్‌పి దిగువన శక్తిని ఉత్పత్తి చేసే 1.6 లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, September 17, 2013, 15:06 [IST]
English summary
Reports say that the 2014 model of the Hyundai i20 will receive serious inputs from its World car Championship version.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+