ఆటో ఎక్స్‌పోలో కొత్త 2014 హ్యుందాయ్ శాంటాఫే ఆవిష్కరణ

By Ravi

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'శాంటాఫే' ఎస్‌యూవీలో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను వచ్చే ఏడాది విడుదల చేసే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి 2014లో ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ ఈ కొత్త 2014 శాంటాఫే ఎస్‌యూవీని తొలిసారిగా ఆవిష్కరించే అవకాశం ఉంది.

ఇదివరకటి శాంటాఫే కన్నా మరింత మెరుగైన పెర్ఫామెన్స్, ఆకర్షనీయమైన ఫీచర్లు ఉండేలా కొత్త శాంటాఫేను తీర్చిదిద్దారు. హ్యుందాయ్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అమెరికన్ మార్కెట్లో విడుదల చేసిన కొత్త శాంటాఫేకు అక్కడి మార్కెట్లో మంచి స్పంధన లభించడంతో, ఈ మోడల్‌ నుంచి స్ఫూర్తి పొంది, ఇండియన్ వెర్షన్ శాంటాఫేను అప్‌గ్రేడ్ చేసే ఆస్కారం ఉంది.

కొత్త 2014 హ్యుందాయ్ శాంటాఫే ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

2014 హ్యుందాయ్ శాంటాఫే

పాత మోడల్ కన్నా కొత్త శాంటాఫే మోడల్ మరింత మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉండనుంది. ఈ సెగ్మెంట్లోని టొయోటా ఫార్చ్యూనర్, చెవర్లే కాప్టివా వంటి మోడళ్లకు ధీటుగా ఉండేలా దీని ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు.

2014 హ్యుందాయ్ శాంటాఫే

హ్యుందాయ్ తమ కొత్త శాంటాఫే ఎస్‌యూవీని స్థానికంగా భారతదేశంలోనే అసెబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. చెన్నైలో ఉన్న కంపెనీ ప్లాంటులో ఈ ఎస్‌యూవీని తయారు చేసే అవకాశం ఉంది. ఫలితంగా దీని ధర కూడా తక్కువగా ఉండొచ్చని అంచనా.

2014 హ్యుందాయ్ శాంటాఫే

భారత మార్కెట్లో కొత్త 2014 హ్యుందాయ్ శాంటాఫే ప్రారంభ ధర రూ.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. ఇది టూ-వీల్ డ్రైవ్, ఆల్-డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

2014 హ్యుందాయ్ శాంటాఫే

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 2.2 లీటర్ ఇంజన్‌నే కొత్త శాంటాఫేలోను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో అనుసంధానం చేయబడి ఉంటుంది.

2014 హ్యుందాయ్ శాంటాఫే

కొత్త శాంటాఫేలో రీడిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్లతో పాటుగా, మెరుగైన నాణ్యత, కొత్త ఎక్విప్‌మెటంట్స్ మరియు ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 5, 2013, 10:55 [IST]
English summary
Hyundai will launch the 2014 Santa Fe SUV in India in Feb at the Auto Show. The new santa Fe is expected to perform a lot better in India than its predecessor as Hyundai has identified the weak links and will sort it out with the coming of the new model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+