ఇండియాకు రానున్న 2014 జీప్ చిరోకీ ఎస్‌యూవీ

By Ravi

వరల్డ్ పాపులర్ ఎస్‌యూవీ 'జీప్' త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫియట్, తమ జీప్ బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురానుంది. ప్రారంభంలో భాగంగా, చిరోకీ ఎస్‌యూవీని జీప్ దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం ఓ చిన్న ఎస్‌యూవీ 'జీప్ చిరోకీ'ని కంపెనీ అభివృద్ధి చేసింది.

ఈనెలలో జరగనున్న జెనీవా మోటార్‌ షోలో కంపెనీ ఈ సరికొత్త 'జీప్ చిరోకీ'ని ఆవిష్కరించనుంది. ఇది ఫియట్-క్రైస్లర్ అలయన్స్ నుంచి వస్తున్న తొలి జీప్ బ్రాండ్ కావటం కూడా విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో జీప్ అందిస్తున్న చిన్న ఎస్‌యూవీ 'లిబర్టీ' స్థానాన్ని ఈ చిరోకీ ఎస్‌యూవీ భర్తీ చేయనుంది. గ్రాండ్ చిరోకీతో పోల్చుకుంటే చిరోకీ పరిమాణంలో కాస్తంత చిన్నదిగా ఉంటుంది. గ్రాండ్ చిరోకీకి, చిరోకీకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.

గ్రాండ్ చిరోకీ ఓ పూర్తి స్థాయి లగ్జరీ ఎస్‌యూవీ కాగా, చిరోకీ ఎంట్రీ-లెవల్ క్రాసోవర్ అని చెప్పవచ్చు. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా సిఆర్-వి, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. దీనిని భారత మార్కెట్లో జీప్ అందించనున్న భవిష్యత్ ఉత్పత్తులు వ్రాంగ్లర్, గ్రాండ్ చిరోకీలకు దిగువన అందుబాటులో ఉంచనుంది. జీప్ చిరోకీని ఫియట్ యొక్క 'కాంపాక్ట్ వైడ్' ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఈ ఫ్లాట్‌ఫామ్‌కు ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అనుసంధానం చేసే వెసలుబాటు కూడా ఉంటుంది. మరి ఇండియాకు రానున్న ఈ బ్యూటీపై ఓ కన్నేద్దాం రండి..!

2014 జీప్ చిరోకీ

2014 జీప్ చిరోకీ

2014 జీప్ చిరోకీ

2014 జీప్ చిరోకీ

2014 జీప్ చిరోకీ

2014 జీప్ చిరోకీ

2014 జీప్ చిరోకీ

2014 జీప్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

జీప్ గ్రాండ్ చిరోకీ

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2013, 16:36 [IST]
English summary
Jeep has quietly released official images of the 2014 model year Jeep Cherokee, but with hardly any details. The Cherokee is Jeep's mid-sized SUV/crossover and is not to be confused with the larger and grander Grand Cherokee. Globally, the Cherokee will replace the Liberty and is meant to take on its prime rivals such as the Honda CR-V and Nissan X-Trail.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+