2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ విడుదల: ధర, ఫీచర్లు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌లో అత్యంత విలాసవంతమైన మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన '2014 ఎస్-క్లాస్ ఎస్ 500' మోడల్‌ను బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఈ 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మోడల్‌ను గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో అంతర్జాతీయంగా విడుదల చేశామని, మూడు నెలల తర్వాత భారత్‌కు తీసుకు వచ్చామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇబెర్‌హర్డ్ కెర్న్ తెలిపారు.

భారత మార్కెట్లో ఈ సరికొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్ 500 కారు ధర రూ.1.57 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న ఎస్-క్లాస్ కేవలం ఒకే ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది, అది లాంగ్ వీల్ బేస్ కలిగిన ఎస్ 500 పెట్రోల్. ఈ ఎస్ 500 కారును జర్మనీలోని సిండెల్‌ఫింగెన్‌లో ఉన్న ప్లాంటులో పూర్తిగా తయారైన కారును సిబియూ రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నారు.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

ప్రారంభంలో భాగంగా, భారత్‌లో కొత్త ఎస్-క్లాస్ అమ్మకాలు పరిమితం చేయనున్నారు. ఇప్పటికే 125 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లు అమ్ముడుపోయాయి. కొత్తగా బుక్ చేసుకున్న వారికి ఏప్రిల్ 2014 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500 కారులో 4.5 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 453 బిహెచ్‌పిల శక్తిని, 700 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

ఇండియన్ వెర్షన్ ఎస్ 500లో మెర్సిడెస్ 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ లేదు. కాబట్టి, ఇందులో సెవన్ స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఈ ట్రాన్సిమిషన్ ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500 గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇది కేవలం 5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

ఇదిలా ఉండగా.. భారత్‌లో స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన మెర్సిడెస్ బెంజ్ ఎస్ 350 సిడిఐ వేరియంట్‌ను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు. ఈ మోడల్‌ను స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తున్న కారణంగా, దీని ధర కూడా తక్కువగా ఉండనుంది.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

కొత్త ఎస్-క్లాస్ కారులో 24 స్పీకర్ల బ్రమెస్టర్ 3డి ఆడియో సిస్టమ్, రిక్లైయినింగ్ హీటెడ్ అండ్ కూల్డ్ సీట్స్ విత్ హాట్ స్టోన్ మసాజ్ ఫంక్షన్స్, చార్జింగ్ స్టేషన్స్, బ్లూటూత్ అండ్ వైఫై హాట్‌స్పాట్, ఫుల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, నైట్ విజన్ అసిస్ట్, యాక్టివ్ రైడ్ కంట్రల్, క్రూయిజ్ కంట్రోల్, పానరోమిక్ సన్‌రూఫ్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు లభ్యం కానున్నాయి.

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

చివరగా.. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారును కొనుగోలు చేసే వినియోగదారులకు కంపెనీ ఉచిత శిక్షణను అందించనుంది. ఇందులో భాగంగా, ఎస్-క్లాస్ కారులోని వివిధ ఫీచర్లను ఎలా ఉపయోగించుకోవాలో కస్టమర్లకు తెలియజేస్తారు.

వీడియో

కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్ 500 మోడల్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2014, 10:49 [IST]
English summary
Mercedes-Benz has launched its most luxurious and technologically advanced model, the 2014 S-Class in India. Unveiled at an event today held in Delhi, the car comes for a starting price of INR 1.57 crores (Ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+