మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి ఆవిష్కరణ: ఫొటోలు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తివంతమైన లగ్జరీ కారు '2014 ఎస్63 ఏఎమ్‌జి'ని రూపొందించిది. తమ పెర్ఫామెన్స్ విభాగం ఏఎమ్‌జితో కలిసి మెర్సిడెస్ ఈ స్పోర్టీయర్ ఎస్63 ఏఎమ్‌జి మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి కారును ఆవిష్కరించనున్నారు.

ఈ నేపథ్యంలో, 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి 4మ్యాటిక్ పవర్‌ఫుల్ హై-పెర్ఫామెన్స్ లగ్జరీ సెడాన్‌కు సంబంధించిన అఫీషియల్ ఫొటోలను, సమాచారాన్ని కంపెనీ విడుదల చేసింది. ఈ కారులో శక్తివంతమైన ఏఎమ్‌జి 5.5 లీటర్, వి8 టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు (ఎమ్157 ఫ్యామిలీకి చెందిన ఇంజన్). ఈ ఇంజన్ గరిష్టంగా 577 హార్స్ పవర్‌ల శక్తిని, 900 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఈ ఇంజన్ ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. ఈ ఇంజన్‌ను ఏఎమ్‌జి 7-స్పీడ్ స్పీడ్‌షిఫ్ట్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది. ఇందులో స్పోర్ట్, కంఫర్ట్, ఎఫీషియన్సీ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల కానుంది. భారత మార్కెట్లో దీని ధర రూ1.17 కోట్ల నుంచి రూ.1.2 కోట్ల రేంజ్‌లో ఉండనుంది. ఈ జర్మన్ బ్యూటీ అందాలను మనం కూడా చూద్దాం రండి..!

ఎస్63 ఏఎమ్‌జి

ఎస్63 ఏఎమ్‌జి

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తివంతమైన లగ్జరీ కారు '2014 ఎస్63 ఏఎమ్‌జి'ని రూపొందించిది.

ఫేస్‌లిఫ్ట్ ఎస్63 ఏఎమ్‌జి

ఫేస్‌లిఫ్ట్ ఎస్63 ఏఎమ్‌జి

మెర్సిడెస్ బెంజ్ పెర్ఫామెన్స్ వెర్షన్ విభాగం ఏఎమ్‌జితో కలిసి కంపెనీ ఈ స్పోర్టీయర్ ఎస్63 ఏఎమ్‌జి మోడల్‌ను అభివృద్ధి చేసింది.

2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి కారును ఆవిష్కరించనున్నారు.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

కొత్త పెర్ఫామెన్స్ వెర్షన్ 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి కారులో ఇంటీరియర్లను రెగ్యులర్ వెర్షన్ కంటే మెరుగ్గా తీర్చిదిద్దారు.

ఇంజన్

ఇంజన్

ఈ కారులో శక్తివంతమైన ఏఎమ్‌జి 5.5 లీటర్, వి8 టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు (ఎమ్157 ఫ్యామిలీకి చెందిన ఇంజన్).

పవర్ అండ్ టార్క్

పవర్ అండ్ టార్క్

ఈ ఇంజన్ గరిష్టంగా 577 హార్స్ పవర్‌ల శక్తిని, 900 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ప్రీమియం లెథర్ సీట్లు

ప్రీమియం లెథర్ సీట్లు

డ్రైవర్, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రీమియం లెథర్‌తో అత్యంత సౌకర్యంగా, విలాసవంతంగా ఉండేలా సీట్లను తీర్చిదిద్దారు. వీటిని ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసుకోవచ్చు.

రియర్ ప్యాసింజర్ సీట్లు

రియర్ ప్యాసింజర్ సీట్లు

వెనుక సీట్లో కూర్చునే ప్యాసింజర్ల కోసం కూడా ఇండివిడ్యూవల్ సీట్లను ఇందులో అమర్చారు. వీటిని కూడా యాంత్రికంగా నియంత్రించుకోవచ్చు.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి స్పోర్టీ వెర్షన్ లగ్జరీ కారు ఇటు వినోదం కోసం అటు డ్రైవర్‌కు కావల్సిన సమాచారం కోసం అధునాతన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను జోడించారు.

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్

ఇది ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఇంజన్ ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది.

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)

ఈ ఏఎమ్‌జి 5.5 లీటర్, వి8 టర్బో ఇంజన్‌ ఏఎమ్‌జి 7-స్పీడ్ స్పీడ్‌షిఫ్ట్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

డ్రైవింగ్ మోడ్స్

డ్రైవింగ్ మోడ్స్

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి కారులో స్పోర్ట్, కంఫర్ట్, ఎఫీషియన్సీ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. డ్రైవర్ నడిపే రోడ్డును బట్టి ఈ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు.

ఎక్స్టీరియర్స్

ఎక్స్టీరియర్స్

కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి ఎక్స్టీరియర్లను స్పోర్టీ ఫీల్ ఉట్టిపడేలా డిజైన్ చేశారు. మొదటి చూపులోనే ఇది కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది.

భారత్‌లో విడుదల

భారత్‌లో విడుదల

2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి హై-పెర్ఫామెన్స్ లగ్జరీ కారు ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

భారత మార్కెట్లో ధర

భారత మార్కెట్లో ధర

కొత్త ఫేస్‌లిఫ్ట్ మెర్సిడెస్ బెంజ్ ఎస్63 ఏఎమ్‌జి ధర భారత మార్కెట్లో రూ1.17 కోట్ల నుంచి రూ.1.2 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, July 18, 2013, 17:13 [IST]
English summary
German luxury carmaker Mercedes Benz has revealed the new facelifted 2014 S63 AMG. The S63 is powered by a 5.5-litre V8 engine that has 585BHP and massive 900Nm of torque. The engine comes mated to a four wheel drive system and the AMG 7-speed Speedshift gearbox.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+