నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ విడుదల; ప్రారంభ ధర రూ.6.99 లక్షలు
జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఇండియా తమ కొత్త 2014 నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను నేడు (జులై 3, 2014) మార్కెట్లో విడుదల చేసింది. కొత్త నిస్సాన్ సన్నీ 8 వేరియంట్లలో (3 పెట్రోల్, 5 డీజిల్) లభిస్తుంది. ఇందులో ఎక్స్ఈ, ఎక్స్ఎల్ వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభిస్తాయి. కాగా.. ఎక్స్‌వి వేరియంట్ మాత్రం కేవలం డీజిల్ వెర్షన్‌లోనే లభిస్తుంది.
కొత్త నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇంజన్స్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇందులో ప్రధానంగా, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్, గ్రిల్, వీల్స్ బంపర్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను చూడొచ్చు. అలాగే ఇంటీరియర్స్‌లో పియానో బ్లాక్ ఫినిష్డ్ సెంటర్ కన్సోల్, కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్స్, సీట్స్ అండ్ డోర్స్‌పై రిఫ్రెష్డ్ ఫ్యాబ్రిక్ వంటి అనేక మార్పులున్నాయి.
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సన్నీ సెడాన్ వేరియంట్లు, ధరలు మరియు వేరియంట్ల వారిగా అందులో లభించే ఫీచర్లను క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

కొత్త నిస్సాన్ సన్నీలో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ తప్ప మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ఇందులో ఇదివరకటి 1.5లీటర్ హెచ్15 పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్లనే ఉపయోగించారు. పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఎక్స్‌ట్రానికి సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ వెర్షన్‌తో మాత్రమే లభిస్తుంది.
మ్యాన్యువల్ పెట్రోల్ వెర్షన్ గరిష్టంగా 99 పిఎస్‌ల పవర్‌ను, ఆటోమేటిక్ పెట్రోల్ వెర్షన్ గరిష్టంగా 101 పిఎస్‌ల పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ గరిష్టంగా 86 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్:
పెట్రోల్ వెర్షన్ (మ్యాన్యువల్) - 16.95 కెఎమ్‌పిఎల్
పెట్రోల్ వెర్షన్ (ఆటోమేటిక్) - 17.97 కెఎమ్‌పిఎల్
డీజిల్ వెర్షన్ (మ్యాన్యువల్) - 22.71 కెఎమ్‌పిఎల్

పెట్రోల్ వెర్షన్ ధరలు:
సన్నీ ఎక్స్ఈ - రూ.6.99 లక్షలు
సన్నీ ఎక్స్ఎల్ - రూ.7.61 లక్షలు
సన్నీ ఎక్స్ఎల్ (సివిటి) - రూ.8.91 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ ధరలు:
సన్నీ ఎక్స్ఈ డి - రూ.7.99 లక్షలు
సన్నీ ఎక్స్ఎల్ డి - రూ.8.6 లక్షలు
సన్నీ ఎక్స్‌వి డి - రూ.9.33 లక్షలు
సన్నీ ఎక్స్‌వి డి ప్రీమియం ప్యాక్ 1 - రూ.9.8 లక్షలు
సన్నీ ఎక్స్‌వి డి ప్రీమియం ప్యాక్ 2 - రూ.9.6 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

బేస్ (ఎక్స్ఈ) వేరియంట్లో బాడీ కలర్డ్ బంపర్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, డ్యూయెల్ ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ ఎకానమీ డిస్‌ప్లే, కప్ హోల్డర్స్, టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాక్, ఏబిఎస్ మరియు బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు లభిస్తాయి.

మిడ్ (ఎక్స్ఎల్) వేరియంట్లో, బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, బ్లాకెన్డ్ రిమ్స్ విత్ వీల్ కవర్స్, బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్, బ్లాక్ బి-పిల్లర్, రియర్ డిఫాగ్గర్, 2-డిన్ ఆడియో సిస్టమ్ (బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీతో) స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్, 4 స్పీకర్లు, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, రియర్ ఆర్మ్ రెస్ట్, గ్రే థీమ్డ్ ఇంటీరియర్స్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, బూట్ ల్యాంప్, యాంటీ-థెఫ్ట్ అలారమ్, సీట్ బెల్ట్ ఇండికేటర్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

ఇకపోతే టాప్ (ఎక్స్‌వి) వేరియంట్ కేవలం డీజిల్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇందులో మిడ్ (ఎక్స్ఎల్) వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా.. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ర్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ (ఇండికేటర్లతో), ఫ్రంట్ బంపర్ మరియు బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్, 2-డిన్ ఆడియో సిస్టమ్ కోసం డిస్‌ప్లే యూనిట్, అవుట్‌సైడ్ టెంపరేచర్ డిస్‌ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, రియర్ వ్యూ కెమెరా, రియర్ ఏసి వెంట్స్, రియర్ రీడింగ్ ల్యాంప్స్, వైపర్స్ కోసం వేరియబల్ స్పీడ్ సెట్టింగ్ ఆప్షన్, ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్స్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

ఎక్స్‌వి వేరియంట్ కోసం కంపెనీ రెండు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. ఇందులో ప్రీమియం ప్యాక్ 1లో లెథర్ సీట్స్, లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్, గేర్ లివర్ ఫీచర్లు లభిస్తాయి. అలాగే ప్రీమియం ప్యాక్ 2లో సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి.

కొత్త నిస్సాన్ సన్నీ కోసం మూడు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టారు. అవి - పెరల్ వైట్, డీప్ గ్రే, నైట్‌షేడ్. ఇవి మూడు కాకుండా.. ఆంక్సీ బ్లాక్, బ్రాంజ్ గ్రే, బ్లేడ్ సిల్వర్ కలర్లలో కూడా ఇది లభిస్తుంది.

ఇది కూడా చదవండి: 2014 నిస్సాన్ సన్నీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్


Click it and Unblock the Notifications








