భారత్‌లో పోర్షే పనామెరా టర్బోస్ ఎస్ వేరియంట్ విడుదల

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పనామెరాలో సరీస్‌లో మరింత ఫాస్టెస్ట్ అండ్ పవర్‌‌ఫుల్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేసింది. 'పోర్షే పనామెరా టర్బో ఎస్' పేరుతో లభ్యం కానున్న ఈ కారులో శక్తివంతమైన 4.8 లీటర్ వి8 ట్విన్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 570 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

పోర్షే పనామెరా ఎస్ టర్బో కేవలం 3.5 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 310 కిలోమీటర్లు. పోర్షే పనామెరా ఎస్ టర్బో ఎస్ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది రెగ్యులర్ పమామెరా ధర కన్నా సుమారు రూ.25 లక్షలు ఎక్కువగా (అంటే రూ.2.25 కోట్లు) ఉండొచ్చని అంచనా.


ఈ పవర్‌ఫుల్ పోర్షే కారును కూడా సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు. ప్రస్తుతం పోర్షే పనామెరా మొత్త ఐదు వేరియంట్లలో లభిస్తుంది. తాజా వేరియంట్ విడుదలతో వీటి సంఖ్య ఆరుకు చేరుకుంది. వాటి ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
Porsche Panamera Turbo S
  • పోర్షే పనామెరా - రూ.1.19 కోట్లు
  • పోర్షే పనామెరా 4 - రూ.1.22 కోట్లు
  • పోర్షే పనామెరా డీజిల్ - రూ.1.23 కోట్లు
  • పోర్షే పనామెరా జిటిఎస్ - రూ.1.60 కోట్లు
  • పోర్షే పనామెరా టర్బో - రూ.1.99 కోట్లు
  • పోర్షే పనామెరా టర్బో - రూ.2.25 కోట్లు (అంచనా ధర)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, November 13, 2013, 10:47 [IST]
English summary
Porsche has launched new Panamera Turbo S variant in Indian. New Panamera Turbo S is more powerful than previous variants. It is powered by a 4.8-litre V8 Twin Turbocharged motor that makes 570HP of max power. The car reaches the 100kph mark in barely 3.5 seconds and has a top speed of 310kmph.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+