ఇండియాకు రానున్న 2014 స్కొడా సూపర్బ్ సెడాన్
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'సూపర్బ్'లో ఓ సరికొత్త అప్‍గ్రేడెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. త్వరలో చైనాలో జరగనున్న 2013 షాంగై మోటార్ షోలో ఈ సరికొత్త 2014 స్కొడా సూపర్బ్ విడుదల కానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కొడా సూపర్బ్‌తో పోల్చుకుంటే డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా ఈ కొత్త వెర్షన్‌ను తీర్చిదిద్దారు. భారత్‌లో లభిస్తున్న స్కొడా సూపర్బ్ స్థానాన్ని రీప్లేస్ చేస్తూ ఈ కొత్త వెర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
2014 స్కొడా సూపర్బ్ ప్రీమియం కారులో బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్, కొత్త బానెట్స కొత్త గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త లోగో, కొత్త ఫాగ్ ల్యాంప్స్‌తో సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఉపయోగించిన అల్లాయ్ వీల్స్‌ను కూడా రీడిజైన్ చేశారు. అలాగే ఈ కారు వెనుక వైపు గమనిస్తే, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్‌తో ఇది సరికొత్త రియర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇంజన్ పరంగా కూడా ఈ కారులో మార్పులు చేయటం జరిగింది. స్టార్ట్-స్టాప్ సిస్టమ్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ వంటి టెక్నాలజీలను ఈ కారులో ఉపయోగించారు.

2014 స్కొడా సూపర్బ్

2014 స్కొడా సూపర్బ్

2014 స్కొడా సూపర్బ్

2014 స్కొడా సూపర్బ్

స్కొడా సూపర్బ్
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కొడా సూపర్బ్ సెడాన్

2014 స్కొడా సూపర్బ్
కొత్త సూపర్బ్ సెడాన్‌లో 1.4 లీటర్ టిఎస్ఐ, 1.8 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించారు. డీజిల్ వెర్షన్‌లో 140 బిహెచ్‌పి 2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, 170 బిహెచ్‌పి 2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. 2014 స్కొడా సూపర్బ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో లభ్యం కానుంది. ఈ సరికొత్త సూపర్బ్ సెడాన్‌లో లభించే మరిన్ని అదనపు ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- త్రీ, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్
- సరికొత్త ఫ్యాబ్రిక్ సీట్స్ (బేస్ వేరియంట్లలో)
- ప్రీమియం లెథర్ సీట్స్ (టాప్ ఎండ్ వేరియంట్లలో)
- ఎల్ అండ్ కె ఎడిషన్ కోసం బ్రైన్, ఐవరీ కలర్ కోడ్
- ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్టమెంట్స్
- సెంటర్ కన్సోల్‌పై జంబో బాక్స్
- ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్
- 6.5 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఈ కొత్త 2014 స్కొడా సూపర్బ్ తొలుతగా యూరోపియన్ మార్కెట్లలో అమ్ముడు కానుంది. అనంతరం సికెడి రూట్లో స్కొడా ఇండియా ఈ కారును విడిభాగాలుగా దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేసి విక్రయించే అవకాశాలున్నాయి. అయితే, ఇందుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








