మరిన్ని మార్పులతో రానున్న 2014 మారుతి సుజుకి స్విఫ్ట్
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో మరిన్ని మార్పులు చేర్పులు చేసిన ఓ సరికొత్త 2014 మోడల్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ 2014 మోడల్ స్విఫ్ట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అయితే, సుజుకి బెల్జియం వెబ్‌సైట్ నుంచి లీక్ అయిన కొత్త స్విఫ్ట్ ఫొటోలను బట్టి చూస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్విఫ్ట్‌కు కొత్త 2014 స్విఫ్ట్‌కు బేసిక్ డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. యూరోపియన్ వెర్షన్ 2014 సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓఆర్‌విఎమ్‌లపై టర్న్ ఇండికేటర్స్, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ అమర్చిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మార్పులను గమనించవచ్చు. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవు.
ఆగస్ట్ 2011లో మారుతి సుజుకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, మరింత స్పోర్టీగా, ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను ఇచ్చేలా కంపెనీ ఈ కొత్త స్విఫ్ట్‌ను తీర్చిదిద్దిన సంగతి తెలిసినదే. అప్పటి నుండి ఈ మోడల్ అమ్మకాలు మరింత జోరుగా సాగుతున్నాయి. కాగా.. ఈ కొత్త ఫీచర్లను జోడించిన 2014 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేస్తే ఈ అమ్మకాలు మరింత పెరిగే ఆస్కారం ఉంది. ఈ కొత్త స్విఫ్ట్‌పై ఓ కన్నేసొద్దాం రండి..!











Click it and Unblock the Notifications








