మరోసారి 2014 కరోలా టీజర్‌ను విడుదల చేసిన టొయోటా
జపనీస్ ఆటో దిగ్గజం టొయోటా తమ నెక్స్ట్ జనరేషన్ కరోలా సెడాన్‌కు సంబంధించి ఇటీవలే ఓ టీజర్ ఫొటోను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, టొయోటా ఇప్పుడు తాజాగా మరిన్ని 2014 కరోలా టీజర్ ఫొటోలను, వీడియను విడుదల చేసింది. 2014 టొయోటా కరోలా సెడాన్‌ను ఈనెల 6వ తేదీన ప్రపంచానికి పరిచయం చేయనుంది.
జూన్ 6, 2013వ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో టొయోటా తమ అధునాత కరోలా సెడాన్‌ను ఆవిష్కరించనుంది. ఈ160 (E160) అనే కోడ్‌నేమ్‌తో టొయోటా ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన 2013 డెట్రాయిట్ ఆటో షోలో కంపెనీ ఆవిష్కరించిన టొయోటా ఫ్యూరియా కాన్సెప్ట్ సెడాన్‌ను ఆధారంగా చేసుకొని ఈ 2014 కరోలా సెడాన్‌ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.
అమెరికా మార్కెట్లో ఈ మోడల్ కరోలా పేరుతో అమ్ముడవుతుండగా, భారత మార్కెట్లో కరోలా ఆల్టిస్ పేరుతో అమ్ముడవుతోంది. నేటి ఆధునిక యువత అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత స్టయిలిష్, ప్రీమియం లుక్ ఉండేలా కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. భారత్‌లో ఈ నెక్స్ట్ జనరేషన్ కరోలా వచ్చే ఏడాది నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

మరోసారి 2014 కరోలా టీజర్‌ను విడుదల చేసిన టొయోటా
2014 టొయోటా కరోలా ఫ్రంట్ గ్రిల్, లోగో టీజర్

మరోసారి 2014 కరోలా టీజర్‌ను విడుదల చేసిన టొయోటా
2014 టొయోటా కరోలా ఫ్రంట్ ఎయిర్ డ్యామ్, ఫాగ్‌ల్యాంప్ టీజర్

మరోసారి 2014 కరోలా టీజర్‌ను విడుదల చేసిన టొయోటా
2014 టొయోటా కరోలా రియర్ టెయిల్ ల్యాంప్ టీజర్


Click it and Unblock the Notifications








