అప్‌గ్రేడెడ్ 2014 టొయోటా ఎతియోస్, లివా మోడళ్ల విడుదల
టొయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎతియోస్ సెడాన్, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ 2014 మోడళ్లలో కొత్త టాప్-ఎండ్ డీజిల్ వేరియంట్లను పరిచయం చేయడంతో పాటుగా, మిడ్-రేంజ్ వేరియంట్లను కూడా అప్‌గ్రేడ్ చేసింది.
టొయోటా ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లో కొత్తగా విడి, విడి ఎస్‌పి (సేఫ్టీ ప్యాక్) అనే రెండు వేరియంట్లను విడుదల చేశారు. ఇదివరకు ఈ వేరియంట్లు కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కాగా.. ఇప్పుడు ఇడి డీజిల్ వెర్షన్‌లో కూడా లభ్యమవుతున్నాయి.

ఈ కొత్త వేరియంట్లలో 2-డిన్ ఆడియో సిస్టమ్ (బ్లూటూత్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ మరియు రిమోట్ కంట్రోల్ కనెక్టివిటీతో), లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్ (టిల్ట్ స్టీరింగ్ ఫంక్షన్‌తో), స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, సైడ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్, రియర్ డిఫాగ్గర్ అండ్ వైపర్, డ్యూయెల్ ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. విడి ఎస్‌పి వేరియంట్లో ఈ ఫీచర్లకు అదనంగా, ఏబిఎస్, ఈబిడిలు స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి.
టొయోటా ఎతియో లివా విడి వేరియంట్ ధర రూ.6.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉండగా, టొయోటా ఎతియో లివా విడి ఎస్‌పి వేరియంట్ ధర రూ.7.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

చివరగా, మిడ్-లెవల్ వేరియంట్లలో ఎతియోస్ సెడాన్, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను (పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లు రెండింటినీ) కూడా కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. ఈ వేరియంట్లు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఫీచర్లతో లభిస్తాయి. ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.4.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటే, ఎతియోస్ సెడాన్ ప్రారంభ ధర రూ.5.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








