భారత్‌లో కొత్త 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో విడుదల
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా అందిస్తున్న పవర్‌ఫుల్ లగ్జరీ ఎస్‌యూవీ 'ల్యాండ్ క్రూజర్ ప్రాడో'లో గడచిన ఆగస్ట్ నెలలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ కొత్త 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో (2014 Toyota Land Cruiser Prado) ఎస్‌యూవీని టొయోటా నేడు (డిసెంబర్ 5, 2013) భారత మార్కెట్లో కూడా విడుదల చేసింది.
ఇదివరకటి ల్యాండ్ క్రూజర్ ప్రాడోతో పోల్చుకుంటే, మరింత ప్రీమియం లుక్, స్టయిలిష్ ఫీచర్లతో కొత్త 2014 ల్యాండ్ క్రూజర్ ప్రాడోను అప్‌గ్రేడెడ్ చేశారు. కొత్త 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు. కొత్త క్రోమ్ గ్రిల్, రిఫ్రెష్డ్ హెడ్‌ల్యాంప్ డిజైన్, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి ల్యాంప్స్ వంటి అనేక మార్పుల చేర్పులను ఈ కొత్త ఎస్‌యూవీలో గమనించవచ్చు.
కొత్త 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో ధర మరియు ఇతర వివరాలను క్రింది ఫొటో ఫీచర్లో పరిశీలించండి.

ఫ్రంట్ డిజైన్
కొత్త 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడోలో ఎక్స్టీరియర్ మార్పుల విషయానికి వస్తే, ఇందులో కొత్త డిజైన్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, బంపర్, ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వంటి మార్పులను ముందువైపు గమనించవచ్చు.

రియర్ డిజైన్
వెనుక వైపు డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన టెయల్‌గేట్, టెయిల్ ల్యాంప్, రియర్ కాంబినేషన్ ల్యాంప్, రియర్ లైసెన్స్ ప్లేట్ గార్నిష్‌లను ఇందులో చూడొచ్చు.

ఇంటీరియర్స్
ఎక్స్టీరియర్లలో చెప్పుకోదగిన మార్పులు ఉన్నప్పటికీ, ఇంటీరియర్లలో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీలో కొత్త స్విచ్‌గేర్, ఫాక్స్ ఉడ్ ఫినిష్‌తో కూడిన సింపుల్ అండ్ పాష్ సెంటర్ కన్సోల్, కొత్త 7ఇంచ్ డిస్‌ప్లేతో కూడిన ఆడియో సిస్టమ్, కొత్త డిజైన్‌తో కూడిన ఆప్టిట్రాన్ మీటర్, సెకండ్ రో సీట్ హీటర్ వంటి మార్పులు ఉన్నాయి.

టెక్నాలజీ అప్‌గ్రేడ్స్
కొత్త 2014 ల్యాండ్ క్రూజ్ ప్రాడో సాంకేతిక అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, ఇందులో క్రాల్ కంట్రోల్ (అత్యవసర పరిస్థితులో కారును యాంత్రికంగా కంట్రోల్ చేసే వ్యవస్థ), మల్టీ-టెర్రైన్ సెలక్ట్ (నడిపే రోడ్డుకు అనుగుణంగా రాక్, రాక్ అండ్ డర్ట్, మొగల్, లూస్ రాక్, మడ్ అండ్ శాండ్ అనే డ్రైవింగ్ మోడ్‌లను ఎంచుకునే సిస్టమ్), మల్టీ-టెర్రైన్ మోనిటర్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటి మార్పులు ఉన్నాయి.

ఇంజన్
ఇంజన్ పరంగా కొత్త ప్రాడోలో ఎలాంటి మార్పుల లేవు. భారత మార్కెట్లో ఇది 3.0 లీటర్ (2982సీసీ), 16-వాల్వ్, డిఓహెచ్‌సి, 4-సిలిండర్, కామన్ రైల్ టర్బో డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190 హెచ్‌పిల శక్తిని, 420 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

కలర్ ఆప్షన్స్
కొత్త 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో మొత్తం ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి - వైట్ పెరల్ క్రిస్టల్ షైన్, సిల్వర్ మెటాలిక్, గ్రే మెటాలిక్, డార్క్ బ్లూ మెటాలిక్, బ్లాక్.

ధర
భారత మార్కెట్లో కొత్త 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ.84.87 లక్షలు (ఎక్స్-షోరూమ్, డిల్లీ)గా ఉంది.

ఆటోమొబైల్స్‌కు సంబంధించిన అన్ని తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








