2014 ల్యాండ్ క్రూజర్‍ను ఆవిష్కరించిన టొయోటా
జపాన్ ఆటో దిగ్గజం టొయోటా అందిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ ల్యాండ్ క్రూజర్ ప్రాడోలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. మునపటి వెర్షన్‌తో పోల్చుకుంటే మరింత ప్రీమియం లుక్, స్టయిలిష్ ఫీచర్లతో కొత్త ల్యాండ్ క్రూజర్‌ను అప్‌గ్రేడెడ్ చేశారు. కొత్త 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు.
కొత్త క్రోమ్ గ్రిల్, రిఫ్రెష్డ్ హెడ్‌ల్యాంప్ డిజైన్, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి ల్యాంప్స్ వంటి మార్పులను ముందు వైపు గమనించవచ్చు. వెనుక వైపు కూడా కొత్తగా డిజైన్ చేసిన టెయల్‌గేట్, టెయిల్ ల్యాంప్‌లను చూడొచ్చు. 2014 మధ్య భాగం నాటికి ఇది అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. ఇక భారత మార్కెట్ విషయానికి వస్తే, ఇది వచ్చే ఏడాది చివరి నాటికి దేశీయ విపణిలోకి రానుంది.

ఎక్స్టీరియర్లలో చెప్పుకోదగిన మార్పులు ఉన్నప్పటికీ, ఇంటీరియర్లలో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, 2014 టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఎస్‌యూవీలో కొత్త స్విచ్‌గేర్, ఫాక్స్ ఉడ్ ఫినిష్‌తో కూడిన సింపుల్ అండ్ పాష్ సెంటర్ కన్సోల్‌తో మరికొన్ని స్టయిలింగ్, కంఫర్ట్ అప్‌డేట్లను ఇందులో గమనించవచ్చు. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
కాగా.. కొత్త ప్రాడోలోఇంజన్ పరమైన మార్పుల గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ల్యాండ్ క్రూజర్ ప్రాడో 4.6 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్, 3.0 లీటర్ డి-4డి డీజిల్ ఇంజన్లతో లభిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








