అప్‌గ్రేడెడ్ వోల్వో ఎస్60, వోల్వో ఎక్స్‌సి60 ఫీచర్లు, ధరలు

By Ravi

స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ కంపెనీ వోల్వో ఇండియా, ఇటీవలే భారత మార్కెట్లో అప్‌గ్రేడెడ్ ఎస్60 సెడాన్, ఎక్స్‌సి60 ఎస్‌యూవీలను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త కార్లలోని కొత్త ఫీచర్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

వోల్వో ఈ అప్‌గ్రేడెడ్ కార్లను తొలిసారిగా, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2013 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది. అప్‍‌గ్రేడెడ్ వోల్వో ఎస్60, వోల్వో ఎక్స్‌సి60 కార్లు కొత్త ఫ్యామిలీ లుక్‌ను కలిగి ఉండి, అధునాతన సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.

వోల్వో ఎస్60 సెడాన్ రెండు ఇంజన్ ఆప్షన్లతో మొత్తం మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. అలాగే, వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీ కూడా రెండు ఇంజన్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ కొత్త కార్లలో లభ్యం కానున్న సరికొత్త ఫీచర్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

వోల్వో ఎస్60, ఎక్స్‌సి60 ఫీచర్స్

ఈ రెండు కార్లలో ముందు వైపు సరికొత్త డిజైన్‌ను గమనించవచ్చు. వెడల్పాటి గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, కొత్త డ్యూయెల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్, కొతత్ హెడ్‌లైట్స్ వంటి మార్పులు చేర్పులను ఈ కార్లలో గమనించవచ్చు.

వోల్వో ఎస్60, ఎక్స్‌సి60 ఫీచర్స్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ గ్లవ్ ఫ్రెండ్లీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను జోడిచారు. ఇందులోని టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వోల్వో అడాప్టివ్ డిజిటల్ డిస్‌ప్లే ఫీచర్‌తో లభిస్తుంది (ఈ ఫీచర్‌ను వోల్వో వి40 క్రాస్ కంట్రీలో తొలిసారిగా పరిచయం చేశారు). స్పోర్టీ లెథర్ సీట్స్, ఆటోమేటిక్ వెర్షన్లలో స్టీరింగ్ వీల్‌పై ప్యాడల్ షిఫ్ట్ (సులువుగా గేర్లు మార్చుకునేందుకు వీలుగా ఉండే స్విచ్‌ల)ను జోడించారు.

వోల్వో ఎస్60, ఎక్స్‌సి60 ఫీచర్స్

వోల్వో ఇందులో సిటీ సేఫ్టీ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది, ఫలితంగా ఇప్పుడు సిటీలో గంటకు 50 కి.మీ. వేగం వరకు పనిచేస్తుంది. రోడ్డుపై ఏవైనా అడ్డంకులు గుర్తిస్తే, ఆటోమేటిక్‌గా బ్రేకులు పడేలా ఇందులో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది.

వోల్వో ఎస్60, ఎక్స్‌సి60 ఫీచర్స్

వోల్వో ఎస్60, వోల్వో ఎక్స్‌సి60 రెండు మోడళ్లు కూడా 2.0 లీటర్ డి4 డీజిల్ ఇంజన్ (163 పిఎస్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్), 2.4 లీటర్ డి5 డీజిల్ ఇంజన్ (215 పిఎస్ పవర్, 420 ఎన్ఎమ్ టార్క్) ఆప్షన్లతో లభిస్తుంది.

వోల్వో ఎస్60, ఎక్స్‌సి60 ఫీచర్స్

వోల్వో ఎస్60 సెడాన్ ధరలు:

* వోల్వో ఎస్60 డి4 కింటెక్: రూ. 29.90 లక్షలు

* వోల్వో ఎస్60 డి4 సమ్మం: రూ. 32.50 లక్షలు

* వోల్వో ఎస్60 డి5 సమ్మం: రూ. 35.50 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

వోల్వో ఎస్60, ఎక్స్‌సి60 ఫీచర్స్

వోల్వో ఎక్స్‌సి60 ధరలు:

వోల్వో ఎక్స్‌సి60 డి4 కింటెక్: రూ. 40.50 లక్షలు

వోల్వో ఎక్స్‌సి60 డి4 సమ్మం: రూ. 43.50 లక్షలు

వోల్వో ఎక్స్‌సి60 డి5 సమ్మం: రూ. 46.55 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2013, 16:08 [IST]
English summary
Volvo has launched the 2014 facelifted S60 saloon and XC60 crossover in India. The two updated models which debuted earlier this year at the Geneva Motor Show wear the new Volvo family design features and come with a few other minor changes, but remains about the same mechanically.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+