74 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు డూప్లికేట్‌వే: ఎన్ఐసి స్టడీ

మనదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందటం చాలా సులభం, డ్రైవింగ్ రాకపోయినా పర్వాలేదు పచ్చనోటు ఉంటే చాలు లైసెన్స్ వచ్చేస్తుంది. ఈ మాట నేను చెప్పడం లేదండోయ్.. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో చేసిన సర్వేలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

మనదేశంలో ఉన్న నకిలీ/డూప్లికేట్ లైసెన్సుల సంఖ్య హాంకాంగ్ దేశ జనాభాతో సమానం అంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. దేశంలో మొత్తం ఆరు కోట్ల మందికి పైగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే, అందులో సుమారు 74 లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు నకిలీవి అయి ఉండొచ్చని నేషనల్ ఇన్ఫర్‌మ్యాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోసం నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడించింది.

ఒకే వ్యక్తికి విభిన్న లైసెన్సులను జారీ చేయటమే కాకుండా, ఒకే సంఖ్యతో కూడిన లైసెన్సులను వివిధ ధరఖాస్తుదారులకు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నట్లు ఈ అధ్యయం వెల్లడిస్తోంది. చట్టాల ఉల్లంఘన, ఏజెంట్లు చేసే మోసం, సక్రమంగా లేని ఆర్టీఓ డేటాబేస్‌ల కారణంగా డూప్లికేట్ లైసెన్సుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నట్లు ఎన్ఐసి పేర్కొంది.

74 Lakh Driving Licenses In India May Be Fake

ఎవరైనా వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడితే, వారు తిరిగి వేరొక ఆర్టీవో కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు పొందటం కూడా ఈ సమస్యకు కారణం అవుతోంది. దేశంలోని అన్ని ఆర్టీవోల దత్తాంశాన్ని కేంద్రీకృతం చేయని కారణంగా ఈ లోపాలు జరుగుతున్నట్లు ఎన్ఐసి అభిప్రాయపడింది.

భారత రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త మోటార్ వాహన చట్టాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, డ్రైవింగ్ లైసెన్సులను ఓ క్రమ పద్ధతిలో జారీ చేయటం, వీటికి సంబంధించిన డేటాను కేంద్రీకృతం చేయటం వంటి అంశాలను ఈ బిల్లులో ప్రవేశపెట్టనున్నారు. ఇది అమల్లోకి వస్తే, నకిలీ డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్య కాస్తయినా తగ్గే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
An exercise carried out by the National Informatics Centre (NIC) for the road transport ministry revealed that around 74 lakh licenses out of the total six crore may be duplicate ones, indicating the systemic flaw in doling out such licenses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X