ఎయిర్‌బ్యాగ్‌లకు కూడా ఎక్స్‌పైరీ డేట్: జపాన్ ఆటో ఇండస్ట్రీ ఛీఫ్

By Ravi

ప్రస్తుతం ప్రపంచమంతటా ఎయిర్‌బ్యాగ్‌ల సమస్య నడుస్తోంది. ప్రపంచంలో కెల్లా అత్యధికంగా ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేసే జపనీస్ కంపెనీ 'టకటా' అనేక కార్ కంపెనీలకు విక్రయించిన ఎయిర్‌బ్యాగ్‌లలో సమస్యలు ఉన్న కారణంగా, సదరు కార్ కంపెనీలు భారీ సంఖ్యలో తమ వాహనాలను రీకాల్ చేస్తున్నాయి.

సాధారణంగా ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకునేటప్పుడు చిన్నపాటి విస్పోటనం జరుగుతుంది. ఎయిర్‌బ్యాగ్ విచ్చుకునేందుకు ఓ ఇన్‌ఫ్లేటర్ (బ్యాగ్‌లో గాలి నింపే సాధనం) ఉంటుంది. టకటా ఎయిర్‌బ్యాగ్‌లలో ఈ ఇన్‌ఫ్లేటర్‌లోనే సమస్య ఉంది. ఎయిర్‌బ్యాగ్ విచ్చుకునేటప్పుడు ఇన్‌ఫ్లేటర్ కదలటం వలన విస్పోటనం జరిగినప్పుడు పగిలిన ప్లాస్టిక్ ముక్కలు, ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లోని ఇతర వస్తువులు కూడా బయటకు వచ్చి, డ్రైవర్/ప్యాసింజర్‌కు హాని కలిగించే ప్రమాదం ఉంది.

Airbags Could Have Expiry Date

ఈ సమస్య కారణంగా, టకటా ఎయిర్‌బ్యాగ్‌లను ఉపయోగించిన అనేక కార్ కంపెనీలు, ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా.. ఇలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ఉండేందుకు ఎయిర్‌బ్యాగ్‌లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేది)ను పరిచయం చేయాలని జపాన్ కార్ కంపెనీలు భావిస్తున్నాయి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో, ఎయిర్‌బ్యాగ్స్‌ను కొన్ని సంవత్సరాల తర్వాత రీప్లేస్ చేయాలనే డిబేట్ రావచ్చని జపాన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ ఫుమిషికో తెలిపారు. ఈ విషయంపై తాము ఇప్పటికే అనధికారికంగా చర్చలు ప్రారంభించామని హోండా మోటార్ చైర్మన్ కూడా చెప్పారు.

అధిక విస్పోటన శక్తితో ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకుంటున్నాయనే కారణంతో హోండా, టొయోటా, జనరల్ మోటార్స్ వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు లక్షల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా రీకాల్స్‌ను ప్రకటిస్తున్న సంగతి తెలిసినదే.

Most Read Articles

English summary
Japanese carmakers are mulling the idea of introducing expiration dates for airbags, the head of the country's auto industrial body said today, after millions of cars around the world were recalled. 
Story first published: Monday, December 22, 2014, 9:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X