బెంట్లీ గ్రాండ్ కన్వర్టిబల్ ఆవిష్కరణ

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ బెంట్లీ మోటార్స్, ఓ పవర్‌ఫుల్ కన్వర్టిబల్ కారును ఆవిష్కరించింది. బెంట్లీ గ్రాండ్ కన్వర్టిబల్ పేరుతో లభ్యం రూపొందిన ఈ కన్వర్టిబల్ కారును నవంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న 2014 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ షోలో బెంట్లీ ముల్సాన్ స్పీడ్ కారును కూడా ప్రదర్శించనున్నారు.

బెంట్లీ గ్రాండ్ కన్వర్టిబల్ కారును పూర్తిగా చేతుల్తో తయారు చేశారు (హ్యాండ్ బిల్ట్). ఇప్పటి వరకూ వచ్చిన కన్వర్టిబల్ కార్లతో పోల్చుకుంటే, తమదే అత్యంత విలాసవంతమైన కన్వర్టిబల్ కారు కానుందని కంపెనీ పేర్కొంది.

ఈ కన్వర్టిబల్ లగ్జరీ కారులో పవర్‌ఫుల్ 6 3/4-లీటర్, ట్విన్-టర్బో, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 530 బిహెచ్‌పిల శక్తిని, 1,100 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ట్రాన్సిమిషన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఎలక్ట్రిక్ బ్లూ పెయింట్ స్కీమ్‌తో ఈ బెంట్లీ గ్రాండ్ కన్వర్టిబల్ కారు ఎక్స్టీరియర్‌ను పెయింట్ చేశారు. విలాసవంతమైన ఇంటీరియర్స్, ప్రీమియం ఫీచర్స్, మోడ్రన్ టెక్నాలజీ, ప్రీమియం ఫినిష్ ఉడెన్ ప్యానెల్స్, ఉడెన్ డ్యాష్‌బోర్డ్ వంటి డీటేలింగ్స్‌ను ఇందులో చూడొచ్చు.

Grand Convertible

ఇంటీరియర్స్‌లో సుమారు 14 రకాల లెథర్ మెటీరియల్స్‌ను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. నవంబర్ 19, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న వాల్ ఏంజిల్స్ ఆటో షోలో ఈ కొత్త బెంట్లీ గ్రాండ్ కన్వర్టిబల్ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు.

Most Read Articles

English summary
British luxury car manufacturer Bentley had recently showcased its premium SUV, which will be launched soon. Today they have unveiled their Grand Convertible, it will be be officially unveiled at the 2014 Los Angeles Auto Show. The show commences on 19th November and Bentley's Mulsanne Speed will also be present.
Story first published: Wednesday, November 19, 2014, 13:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X